VijayaSai Reddy: చంద్రబాబుకు అధికారం రావడం కల..ఆయనది శాడిజమన్న విజయసాయిరెడ్డి..!

VijayaSai Reddy: ఏపీలో వైసీపీ కొత్త జోష్‌లో ఉంది. గతంలో ఎన్నడూ లేవిధంగా వైసీపీ ప్లీనరీ సక్సెస్ అయ్యింది. గుంటూరు జిల్లా వేదికగా పలు రాజకీయ తీర్మానాలను ఆమోదించుకున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 10, 2022, 04:45 PM IST
  • ఏపీలో రాజకీయ వేడి
  • ప్లీనరీ సక్సెస్ అయ్యిందన్న వైసీపీ
  • విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు
VijayaSai Reddy: చంద్రబాబుకు అధికారం రావడం కల..ఆయనది శాడిజమన్న విజయసాయిరెడ్డి..!

VijayaSai Reddy: వైసీపీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈసమావేశాలు పార్టీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని చెప్పారు. మూడు రాజధానులు, మహిళా సాధికారత వంటి రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టి ఆమోదించుకున్నామన్నారు.

జోరు వానలో వైసీపీ ప్లీనరీ సక్సెస్ అయ్యిందన్నారు. దీనిని చూసి టీడీపీ, జనసేన ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ప్లీనరీపై పచ్చ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని..ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు విజయసాయిరెడ్డి. గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ ప్లీనరీకి దాదాపు 9 లక్షల మంది వచ్చారని..ఇది చూసి చంద్రబాబు మెదడు చేతిలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్ లేదన్నారు విజయసాయిరెడ్డి. వైసీపీ ప్లీనరీకి, టీడీపీ మహానాడుకు చాలా తేడా ఉందని తెలిపారు. ప్రజలకు ఏం చేశాం..ఏం చేయబోతున్నాం వంటి అంశాలను ప్లీనరీ చర్చించామని..ఒకరిని తిట్టడం కోసం సమావేశం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు ఎందులోనూ జగన్‌కు పోటీ పడలేరని విమర్శించారు. 

త్వరలో మళ్లీ టీడీపీ, జనసేనకు ప్రజలు బుద్ధి చెబుతున్నారన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. అమరావతి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ అని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు అధికారం రావడం కల అని..టీడీపీని ప్రజలు విశ్వసించబోరని స్పష్టం చేశారు. ప్లీనరీ తర్వాత మృతి చెందిన గణేష్ అనే యువకుడిని ఆదుకుంటామన్నారు.

Also read:Shahid Afridi: టీ20 ప్రపంచ కప్‌ ఈసారి టీమిండియాకే..రోహిత్ సేనపై పాక్‌ మాజీ ప్లేయర్ ప్రశంసలు..!

Also read:7 Years of Baahubali: బాహుబలి ఈ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x