Leopard Alert: ఉద్యోగులు కాదంటున్నా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం నిలిపేశాయి. విధిగా ఆఫీసుకు రావల్సిందే అంటున్నాయి. అలాంటి కంపెనీ ఇన్ఫోసిస్ ఇప్పుడు తిరిగి వర్క్ ఫ్రం హోం అంటోంది. చెప్పేవరకూ ఆఫీసుకు రావద్దంటోంది. అది కూడా ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ మాత్రమే. ఎందుకీ పరిస్థితి, ఏం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ఫోసిస్ మైసూరు ప్రాంగణం ఉద్యోగులుక వార్నింగ్ మెయిల్స్ పంపించింది. ఈ మెయిల్స్ సారాంశం ఏంటంటే ఇక నుంచి ఆ బ్రాంచ్ ఉద్యోగులంతా ఇంట్లోంచే పని చేయాలి. తిరిగి చెప్పేవరకు ఇంట్లోంచే పనిచేయాల్సి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే ప్రమాదంలో పడతారని కూడా హెచ్చరించింది. హెచ్‌ఆర్ నుంచి ఈ మెయిల్స్ అందరు ఉద్యోగులకు వెళ్లింది. కారణం ఏంటంటే ఇన్ఫోసిస్ మైసూరు ప్రాంగణం ఉన్న హెబ్బాల్ ఇండస్ట్రియల్ ఏరియా రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతమంతా చిరుత పులులకు నిలయం. ఈ మధ్య రెండు మూడ్రోజులగా క్యాంపస్‌లో చిరుతపులులు తిరుగుతూ కన్పించాయి. 


దాంతో ఉద్యోగుల రక్షణార్ధం సంస్థ అందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. అటు అటవీశా, ఇటు టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో జల్లెడ పడుతోంది. ఈ ప్రాంగణంలో చిరుత పులులు సంచరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా అంటే 2011లో ఓ చిరుత ఇలానే హల్‌చల్ చేసింది. ఇప్పుడు మరోసారి చిరుత సంచారం ఉండటంతో కంపెనీ ఉద్యోగుల్ని ఇంట్లోంచి పని చేసుకోమని స్పష్టం చేసింది. 


Also read: Mid Day Meals: ఏపీలో మరో పధకం, రేపట్నించి ఇంటర్ విద్యార్ధులకు సైతం మిడ్ డే మీల్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.