Type2 Diabetes: డయాబెటిక్ బాధితులకు బిగ్ రిలీఫ్.. వారానికి ఒకసారి ఇన్సులిన్ తీసుకున్న పనిచేస్తుందంట..
Types Of Diabets: షుగర్ బాధితులు ప్రతిరోజు అన్నంతినక ముందు తప్పకుండా ఇన్సులిన్ తీసుకొవడం మనం తరచుగా చూస్తుంటాం. కొందరు పొట్టకింది భాగంలో తీసుకుంటే, మరికొందరు చేతులకు ఇంజక్షన్ చేసుకుంటారు. ఈ క్రమంలో డాక్టర్లు తాజాగా అధ్యయనం లో ఇన్సులిన్ రోజుతీసుకొవాల్సిన ఇబ్బందిలేదని తెలిపారు.
Once Weekly Insulin For Type2 Diabetes: ప్రస్తుతం సమాజంలో డయాబెటిక్ సమస్య అనేది కామన్ గా మారిపోయింది. ఇది ఈ వయస్సులతో నిమిత్తంలేకుండా అందరిలో వస్తుంది. ఒకప్పుడు డయాబెటిక్ సమస్య అనేది నలభై ఐదేళ్లు దాటకా వచ్చేది కానీ ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. చక్కెర వ్యాధి చిన్న వయసులో ఉన్న వారిలో కూడా వస్తుంది. ఈ క్రమంలో చిన్నప్పుడే నోటికి ఇష్టమైనవి తినకుండా తాళం వేసుకొవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డయాబిటిక్ సమస్య ఉన్నవారికి విపరీతంగా ఆకలేస్తుంటుంది. దీంతో బాడీలో షుగర్ లెవర్స్ పెరిగిపోతుంటాయి.
Read More: Samantha Ruth Prabhu: బాత్రూమ్‌లో హాట్ హాట్ ఫోజులిచ్చిన సమంత
ఈ క్రమంలో కొందరు అన్నం తినేముందు ఇన్సులిన్ చేసుకుంటారు. పొట్టకు, చేతికి చేసుకుంటారు. చక్కెర ఉన్న వారు.. రాత్రిపూట అన్నం ను కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అంతే కాకుండా.. రెగ్యులర్ గా డైట్ మెంటైన్ చేయాలి. స్వీట్లు ఎక్కువగా తినకూడదు. ఒక వేళ తిన్న కూడా షుగర్ ఫ్రీస్వీట్లను తినాలి. కానీ రెగ్యులర్ గా మాత్రం డాక్టర్ కన్సెల్టేషన్ కు వెళ్తుండాలి. కొందరికి మాత్రంషుగర్ లెవల్స్ భారీగా ఉంటాయి.
ఇలాంటి వారు రోజు పొట్టకు,చేతులకు ఇన్సులిన్ వేసుకుంటారు. ఈ క్రమంలోనే మన దేశంలో టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు.. ప్రతిరోజు ఇంజక్షన్ చేసుకుంటుంటారు. కానీ ఇలాంటి వారికి పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. కొందరికి డైలీ ఇంజక్షన్ చేసుకొవడం పెద్ద తలనొప్పిగా భావిస్తారు.
Read More: Abc Juice Benefits: ఈ మిరాకిల్ జ్యూస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మీరు తప్పకుండా తీసుకోండి!
పదే పదే పొడుచుకోవడం కూడా అంత మంచిది కాదంటారు నిపుణులు.. ఇలాంటి క్రమంలో వారానికి ఒకసారి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకున్న కూడా అది వీక్లి అంతా పనిచేస్తుందని వైద్యులు కనుగొన్నారు. 2025 నాటికి ఈ ఇన్సులిన్ ఔషధం అందరికి అందుబాటులోకి వస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో మన దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిక్ బాధితులకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook