పర్యాటకాన్ని(Tourism) పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పర్యాటక ప్రాంతాలుగా సరికొత్త ప్రదేశాల్ని ఎంపిక చేస్తూ పర్యాటకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆ లైట్ హౌస్ లను ఎంపిక చేసింది. ఇకపై ఆ లైట్ హౌస్ లు ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా (Lighthouses as Tourism centres) విరాజిల్లనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇప్పటివరకూ పర్యాటకేంద్రాలుగా చూస్తూ వచ్చిన వాటి జాబితాలో ఇకపై లైట్ హౌస్ లు చేరనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న లైట్ హౌస్ ( Light house) లను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో ఉన్న 194 లైట్ హౌస్ ( 194 Light Houses) లను అతి పెద్ద పర్యాటక ప్రాంతాలు ( Biggest Tourism centres) గా తీర్దిదిద్దాలని కేంద్ర నౌకాయాన శాఖ ( Central Minister for Shipping) మంత్రి మాన్సుఖ్ మాండవియా ( Mansukh Mandaviya) సూచించారు. మంగళవారం నాడు జరిగిన హై లెవెల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యూజియం, అక్వేరియం, చిల్డ్రన్ ప్లే ఏరియా, గార్డెన్స్ , వాటర్ పార్క్స్ వంటి నిర్మాణం ద్వారా పెద్దఎత్తున లైట్ హౌస్ లను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. లైట్ హౌస్ సమీప ప్రాంతాల్ని అభివృద్ధి చేయడం ద్వారా లైట్ హౌస్ ల ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని  కేంద్ర మంత్రి మాండవియా తెలిపారు. దీనికోసం  వందేళ్ల కంటే ఎక్కువ చరిత్ర ఉన్న లైట్ హైౌస్ లను గుర్తించనున్నారు. లైట్ హోస్ ల పనితీరు, చరిత్ర, ప్రాముఖ్యత, పనిచేస్తున్న లైట్ హౌస్ ల గురించి మ్యూజియంలలో పొందుపర్చనున్నారు. గుజరాత్ ( Gujarath) లో గోప్ నాధ్, ద్వారకా,వెరవల్ లైట్ హౌస్ ల అభివృద్ధి గురించి మంత్రి మాండవియా అడిగి తెలుసుకున్నారు. Also read: CAPF: కేంద్ర భద్రతాబలగాలకు కరోనా సెగ: 27 మంది మృతి


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..