కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus) మహమ్మారి కేంద్ర భద్రతాబలగాల్ని సైతం వదలడం లేదు. దేశ భద్రత కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే జవాన్లను కరోనా కబళిస్తోంది. రోజురోజుకూ కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఒక్క జూన్ లోనే 18 మంది కరోనాకు బలయ్యారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. కేంద్ర భద్రతా బలగాల్లో ఎక్కడ ఎన్నెన్ని కేసులున్నాయి ?
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( CAPF) సిబ్బందికి కరోనా సెగ గట్టిగా తగులుతోంది. ఒక్కొక్కరిగా అందరూ కరోనా వైరస్ సంక్రమణకు లోనవుతున్నారు. ఏఎన్ఐ (ANI) అందించిన సమాచారం మేరకు... ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన సీఏపీఎఫ్ సిబ్బంది సంఖ్య 4 వేల 8 వందలు దాటేసింది. మొత్తం 27 మంది కరోనా కారణంగా మరణించగా...ఒక్క జూన్ నెలలోనే 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1905 మంది కరోనా యాక్టివ్ పేషెంట్లుగా ఉన్నారు. వీరికి చికిత్స అందుతోంది. అటు సీఆర్పీఎఫ్ ( CRPF) సిబ్బందిలో ఇప్పటివరకూ 1510 మందికి కరోనా సోకింది. ఇందులో 755 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 9 మంది సీఆర్పీఎఫ్ జనాన్లు కరోనా కారణంగా మృతి చెందగా...ఒక్క జూన్ లోనే 7 మంది మరణించారు. ఇటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో 13 వందల మందికి కరోనా వైరస్ తాకింది. 5 గురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా, జూన్ లో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం 526 యాక్టివ్ కేసులున్నాయి. సశస్త్ర సీమా బల్ (SSB) లో కరోనా సోకిన వారి సంఖ్య 153 కాగా జూన్ నెలలో ఇద్దరు మృతి చెందారు. ఎన్ డీ ఆర్ ఎఫ్ (NDRF) బలగాల్లో 249 మందికి కరోనా సోకినట్టు తేలగా...వంద వరకూ యాక్టివ్ కేసులున్నాయి.నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ( NSG) లో 75 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. Also read: Burglars: పీపీఈ కిట్ లు ఇలా కూడా వాడొచ్చా
కరోనా వైరస్ సోకి చికిత్స అనంతరం కోలుకున్న సీఏపీఎఫ్ సిబ్బంది ప్లాస్మాను సైతం దానం చేయడం విశేషం. Also read: Plasma bank: ప్లాస్మా బ్యాంకు ఎలా ఉంటుంది ? ఎవరు అర్హులు ?
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..