LPG Cylinder:  విజయదశమి  పండుగకు ముందు జనాలకు షాక్. ఎల్పీజీ వినియోగదారుకు షాకిచ్చింది కేంద్రం. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లపై పరిమితి విధించింది. ఇక నుంచి వినియోగదారులకు ఏడాదికి 15, నెలకు 2 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు. అంతకు మించి సిలిండర్లు కొనుగోలు చేస్తే సబ్సిడీ లభించదు. 15 కంటే ఎక్కువ సిలిండర్లు కావాలంటే అందుకు స్పష్టమైన కారణం చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఆధారాలను సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమర్పించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నేచురల్ గ్యాస్ ధరలను కేంద్ర సర్కార్ పెంచేసింది. పవర్ జనరేషన్, ఎరువుల తయారీకి వినియోగించే నేచురల్ గ్యాస్ ధరలను కేంద్ర సర్కార్ 40 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచి వచ్చే ఆరు నెలల వరకు అమలులో ఉంటాయని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ ప్రకటించింది. సీఎన్జీ వాహనాలు, ఇళ్లలో వంట కోసం వాడే పైప్ లైన్ గ్యాస్ లో నేచరల్ గ్యాస్ ను వినియోగిస్తారు. ధరల పెంపుతో సీఎన్జీ వాహనదారులకు భారం డబుల్ కానుంది.


Also Read : Khairatabad Ganesh: బ్రేకింగ్.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి చైర్మెన్ మృతి


Also Read : APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి