APPSC Group 1 Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

APPSC Group 1 Notification: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ ఎట్టకేలకు వచ్చింది. 92 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2022, 07:09 AM IST
  • అక్టోబరు 13 నుంచి నవంబరు 2 వరకు దరఖాస్తులకు గడువు
  • గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష- డిసెంబర్ 18, 2022
  • గరిష్ట వయోపరిమితి మరో 2 ఏళ్లు పొడిగింపు
APPSC Group 1 Notification 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 92 గ్రూప్‌-1 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

APPSC Group 1 Notification 2022: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 92 పోస్టులకు ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ (APPSC Group 1 Notification 2022) విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్లో గ్రూప్-1 పోస్టులతోపాటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ఫెక్టర్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులను  ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం psc.ap.gov.in వెబ్ సైట్ చూడండి. 

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022 నిర్వహించనుండగా... మెయిన్స్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నోటఫికేషన్ ద్వారా మెుత్తం 13 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా డిప్యూటీ కలెక్టర్ - 10, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12, డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13 పోస్టులు ఉన్నాయి. 

ప్రస్తుతం గ్రూప్-1 పోస్టులు 92, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులు 17 ఉన్నాయి.  గ్రూప్-1 పోస్టుల దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 13 నుంచి నవంబరు 2 వరకు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నవంబరు 2 నుంచి 22 వరకు టైం ఇచ్చారు. గ్రూప్-1 పోస్టులకు రాతపరీక్షలతోపాటు ఇంటర్వ్యూలు నిర్వహించాలని రీసెంట్ గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతంలో 34 ఏళ్ల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ జీవో 105 జారీ చేశారు. ఇది 2023 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుంది. 

Also Read: ST Reservations: గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంపు.. ఎస్టీలకు కేసీఆర్‌ దసరా గిప్ట్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News