కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ఉత్తమం. వైద్య నిపుణులు, అధికారులు ఇదే విషయాన్ని సూచిస్తున్నారు. అయితే మీకు బ్యాంకులో ఏమైనా పనులుంటే ముందుగా జులైలో బ్యాంకు సెలవుదినాలు (Bank Holidays In July 2020) తెలుసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరి అయితేనే బ్యాంకులకు వెళ్లడం ఉత్తమం. దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జులై నెలలో(Bank Holidays In July) ఆదివారాలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు. వీటితో పాటు ఏవైనా ప్రత్యేక రోజులు ఉంటే బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులైలో ఆదివారాలైన 5, 12, 19, 26 తేదీలలో బ్యాంకులకు సెలవు. వీటితో పాటు రెండో శనివారం జులై 11, నాలుగో శనివారం జులై 25వ తేదీలలో బ్యాంకు సెలవు దినాలు. 


తెలంగాణలో బోనాల పండుగ సెలవు సందర్బంగా జులై 20న బ్యాంకులు పనిచేయవు. అదే విధంగా జులై 31న ముస్లింల పండుగ బక్రీద్ హాలిడే ఉంటుంది. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో విశిష్టతను, ముఖ్యమైన రోజులను బట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ