Ram Temple: రామ మందిరం భూమి పూజకు అతిథుల జాబితా ఇదే
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు.
న్యూ ఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు. యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath) కాకుండా మరే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు. Also read: Independence day 2020: ఆగస్టు 15న దాడులకు ఐఎస్ఐ భారీ కుట్ర
ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇతర ప్రముఖుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే- రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్, కృష్ణగోపాల్, ఇంద్రేష్ కుమార్, యోగా గురు బాబా రాందేవ్, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ అయిన కల్యాణ్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ, మాజీ కేంద్ర మంత్రులు మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, సాద్వి రితాంభర, జగద్గురు రామభద్రచార్య, జైబన్ సింగ్ పొవైయ, వినయ్ కతియార్, రాధె రాధె బాబా ఇండోర్, యుగ్ పురుష్ పర్మానంద్ ఉన్నారు. Also read: Also read: Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్
రామ మందిరం నిర్మాణం (Ram Mandir in Ayodhya) ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ చారిత్రక కట్టడం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో పాల్గొనాలనే ఉన్నప్పటికీ.. కరోనావైరస్ ( Coronavirus) వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం 200 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి ఒక్కటే సమస్య కాకుండా... వచ్చిన అతిథులకు భద్రత కల్పించడం కూడా మరో సమస్యే అవుతుందనేది మరో కారణంగా తెలుస్తోంది. Also read : Ram Mandir: టైమ్ క్యాప్సుల్ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?
విశ్వ హిందూ పరిషత్ (VHP), శ్రీరామ జన్మభూమి తీర్థ శ్రేత్ర ట్రస్టు, రామ్ మందిరం హై పవర్ కమిటీ సభ్యులు ఈ భూమిపూజ ఆహ్వానితుల జాబితాను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఒకట్రెండు రోజుల్లో ఆహ్వానితులు అందరికీ టెలిఫోన్ ద్వారా కానీ లేదా లేఖల రూపంలో కానీ సమాచారం అందిస్తామని సంబంధిత వర్గాలు జీ మీడియాకి తెలిపాయి. Also read: BREAKING: సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియాపై కేసు నమోదు