Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్

Time capsule under Ram Temple: టైమ్ క్యాప్సుల్.. ఈ టైమ్ క్యాప్సుల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైమ్ క్యాప్సుల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ ( bhoomi-pujan ) చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Last Updated : Jul 27, 2020, 12:56 PM IST
Time capsule: రామ మందిరం కింద 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్

Time capsule under Ram Temple: టైమ్ క్యాప్సుల్.. ఈ టైమ్ క్యాప్సుల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైమ్ క్యాప్సుల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ ( bhoomi-pujan ) చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఐతే, అసలు రామ జన్మ భూమిలో రామ మందిరం నిర్మాణం ఇప్పటివరకు ఆలస్యం అవడానికి కారణం అక్కడి స్థల వివాదమే కారణమనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. దశాబ్ధాల తరబడిగా అపరిష్కృతంగా ఉంటూ వచ్చిన అయోధ్య స్థల వివాదం సుప్రీం కోర్టు తీర్పుతో ( Ayodhya verdict ) ఇటీవలే ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే, రామ జన్మభూమి ( Ram Janmabhoomi ) విషయంలో ఇదివరకు ఏర్పడిన వివాదాలు ఇకపై భవిష్యత్‌లోనూ మళ్లీ ఏర్పడకూడదనే ఉద్దేశంతో రామాలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్న రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదే టైమ్ క్యాప్సుల్.. అవును.. రామ మందిరం స్థలం అడుగున దాదాపు 2000 ఫీట్ల అడుగుల లోతులో ఓ టైమ్ క్యాప్సుల్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపల్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపారు. 

Also read: అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

What is time capsule టైమ్ క్యాప్సుల్ అంటే ఏంటి ?
టైమ్ క్యాప్సుల్ అంటే ప్రస్తుత కాలానికి సంబంధించిన ఆధారాలను భవిష్యత్ తరాలకు చరిత్ర రూపంలో తెలియజేసేలా ఉన్న వస్తు, సామాగ్రి, దస్త్రాలను పదిలంగా భద్రపరిచిన ఓ పెట్టెలాంటి వస్తువునే టైమ్ క్యాప్సుల్ అంటాం. భవిష్యత్‌లో కొన్ని దశాబ్ధాలు, లేదా వందలు, వేళ్ల ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ఏదైనా వివాదం తలెత్తినా.. అక్కడి చరిత్రకు సంబంధించిన నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నా... ఇలాంటి టైమ్ క్యాప్సుల్స్ ఉపయోగపడతాయి. 

Also read: అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

రామ మందిరం కింద టైమ్ క్యాప్సుల్ ఎందుకు ?
అయోధ్య స్థల వివాదం ( Ayodhya land dispute ) ఎన్నో గుణపాఠాలను నేర్పింది. ఆ స్థలంలో గతంలో రాముడి దేవాలయం ఉందని నిరూపించేందుకు ఈ తరానికి కొన్ని దశాబ్ధాలే పట్టింది. ఒకవేళ భవిష్యత్‌లోనూ మళ్లీ ఇలాంటి వివాదాలే తలెత్తితే... ఆ రోజున ఇప్పటిలా దశాబ్ధాల తరబడి ఆ వివాదం కొనసాగకుండా ఉండేందుకు.. 2020లో రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం భూమి పూజకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, ఎలాంటి పరిణామాల మధ్య కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, ఈ స్థల వివాదం ఎలా సద్దుమణిగింది, అసలు ఈ స్థలంలో రాముడి ఆలయం ఉందనడానికి తగిన ఆధారాలు ఏంటి అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పేందుకు రామ మందిరం అడుగున ఈ టైమ్ క్యాప్సుల్ ఏర్పాటు చేస్తున్నట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ( Ram Janmabhoomi Teerth Kshetra Trust ) తెలిపింది. Also read: 
Ayodhya: రామ జన్మభూమి శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

Trending News