Assembly Election Results 2022 LIVE*: యూపీలో విజయం దిశగా బీజేపీ- రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

Thu, 10 Mar 2022-4:09 pm,

Assembly Election Results 2022 LIVE: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Assembly Election Results 2022 LIVE: ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, ఉత్తరాఖండ్​, మణిపూర్​, గోవాలో ఇటీవల మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగాయి. 7వ తేదీగనా యూపీలో తుది విడత ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్యే కౌంటింగ్​ జరుగుతోందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. భౌతికదూరం పాటించడం, మాస్క్​ పెట్టుకోవడం, శానిటైజర్​ వాడటం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని కౌంటింగ్ సిబ్బందికి స్పష్టం చేసినట్లు వివరించింది.


ముందుగా పోస్టల్​ బ్యాలెట్​లలోని ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారని ఈసీ వివరించింది.


ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​పైనే అందరి దృష్టి ఉంది. ఈ రాష్ట్రాలు దేశ రాజకీయాలకు కీలకంగా ఉండటమే ఇందుకు కారణం. ఎగ్జిట్​ పోల్స్​లో యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడగా.. పంజాబ్​లో అధికారం చేతులు మారటం ఖాయం అని సర్వేలు అంచాలు ఉన్నాయి.


Latest Updates

  • ముఖ్యమంత్రి పరాజయం..

    ఉత్తరాఖండ్​లో విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీకి చుక్కెదురైంది. ఆ రాష్ట్ర సీఎం (బీజేపీ) పుష్కర్​ సింగ్ ధామీ.. ఎన్నికల్లో ఓడిపోయారు. ఖటిమా నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలైనట్లు ఈసీ డేటాలో తేలింది.

  • ఇక పంజాబ్​లోను ఆప్ సర్కార్​..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పంజాబ్​లో ఫలితం తేలిపోయింది. ఆప్​ అధికారంలోకి రానుంది.

    ఇప్పటికే రాష్ట్రంలో 66 సీట్లు సొంతం చేసుకుంది ఆప్​. పంజాబ్​లో మ్యాజిక్ ఫిగర్​ 59 కావడం గమనార్హం. ఇవే కాకుండా మరో 28 స్థానాల్లో ఆధిక్యంతో క్లీన్​ స్వీప్​ చేసే దిశగా ఓటింగ్ సరళి సాగుతోంది.

  • పంజాబ్​ సీఎం, పీసీసీ చీఫ్​ ఓటమి..

    పంజాబ్​లో ఆప్​ జోరుకు.. ప్రత్యర్థి పార్టీలు విల విల లాడుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఓటమిపాలవుతున్నారు. సీఎం చరణ్ జిత్​ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమిపాలయ్యారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్ సిద్ధూ సైతం ఓడిపోయారు.
     

  • యూపీలో బీజేపీ సంబరాలు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    యూపీలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖరారైది. ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. బీజేపీ మొదటి నుంచి మ్యాజిక్ ఫిగర్​ను దాటి ఆధిక్యంలో ఉంది.

    దీనితో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్​ కూడా విజయోత్సవాలు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

  • యూపీలో బీజేపీ సంబరాలు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    యూపీలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖరారైది. ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. బీజేపీ మొదటి నుంచి మ్యాజిక్ ఫిగర్​ను దాటి ఆధిక్యంలో ఉంది.

    దీనితో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్​ కూడా విజయోత్సవాలు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

  • సోనూ సూద్ సోదరి ఓటమి..

    పంజాబ్​లో నటుడు సోనూ సూద్​ సోదరి..మాళవిక సూద్​ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున.. మోగా స్థానానికి పోటీ చేశారు మాళవికా. ఆప్​ అభ్యర్థి అమన్​దీప్​ కౌర్​ చేతిలో ఓటమిపాలయ్యారు.

  • యూపీలో బీజేపీ జోరు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    యూపీల బీజేపీ జోరు కొనసాగుతోంది. ఈసీ డేటా ప్రకారం.. ఒక్క ఫలితం కూడా రాలేదు. అయితే 249 స్థానాల్లో బీజేపీ లీడ్​లో ఉన్నట్లు తెలిసింది. ఎస్​పీ 122 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    ఇక కాంగ్రెస్​, బీఎస్​పీలు చెరో 2 స్థానాల్లో మాత్రమే లీడ్​లో ఉన్నాయి.. 

    మొత్తం 403 స్థానాలకు గాను... 202 స్థానాల్లో గెలిస్తే యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంది. అంటే ఈ లెక్కన బీజేపీ మ్యాజిక్ ఫిగర్​ కన్నా చాలా సీట్లు ఆధిక్యంలో ఉంది. దీనితో మరోసారి యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమైంది.
     

  • భగవంత్ మాన్​ విజయం..

    పంజాబ్​లో ఆప్​ దూసుకెళ్తోంది. సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​ విజయం సాధించారు. ధురి నుంచి ఆయన విజయ ఢంకా మోగించారు. ఇక పజాబ్ సీఎం చరణ్​జిత్ సింగ్ మాత్రం రెండ స్థానాల్లో వెనకంజలో ఉన్నారు.

  • గోవాలో అధికారం చేపడతాం..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    గోవాలో మరోమారు అధికారం చేపట్టనున్నట్లు చెప్పారు ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్​ (బీజేపీ). స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టుకుని అధికారం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే గోవాలో బీజేపీ విజయోత్సవాలు జరుపుకుంటోంది.

    ప్రస్తుతం గోవాలో 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. గోవాలో మ్యాజిక్ ఫిగర్ 21. కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు లీడ్​లో ఉన్నారు.
     

  • అరవింద్ కేజ్రివాల్ హర్షం.. ఓటమిని అంగీకరించిన సిద్దూ..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పంజాబ్​లో ఫలితాలపై పార్టీల కీలక నేతలు స్పందిస్తున్నారు.. విప్లవాత్మక విజయాన్ని అందించిన పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రివాల్​ ట్వీట్​ చేశారు.

    ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు పంజాబ్ పీసీసీ చీఫ్​ నవజోత్​ సింగ్ సిద్దూ ట్విట్టర్​ ద్వారా తెలిపారుడ. విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్​కు శుభాకాంక్షలు తెలిపారు సిద్ధూ.

    ఇక ఇదిలా ఉండగా.. కెప్టెన్ అమరిందర్ సింగ్ (పంజాబ్​ మాజీ సీఎం) ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పటియాలా నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసింది.

     

  • పంజాబ్​లో ఫలితాలు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పంజాబ్​లో ఫలితాలు వెలువడుతున్నాయి. రెండు స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఈసీ.

    పఠాన్​కోట్​లో బీజేపీ అభ్యర్థి అశ్విని కుమార్​ శర్మ విజయం సాధించారు.

    కపుర్తలాలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్జిత్​ సింగ్ గెలుపొందారు.

  • ఉత్తరప్రదేశ్ ట్రెండ్స్: యూపీలో మొదలైన బీజేపీ సంబరాలు.. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి 12,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్  

     

  • నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో బీజేపీ 
    ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు కనిపిస్తుంది. పంజాబ్ మినహా.. ఉత్తర్ ప్రదేశ్​లో 276 స్థానాల్లో, ఉత్తరాఖండ్​లో 45 స్థానాల్లో, మణిపూర్​లో 26 స్థానాల్లో, గోవాలో 17 స్థానాల్లో లీడ్​లో ఉంది. 

    పంజాబ్​లో కాంగ్రెస్ కు కోలుకోని దెబ్బ తగిలేలా ఉందని చెప్పాలి. ఆ రాష్ట్రంలో ఆప్ 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. 
     

  • ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు కనిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్​లో 258 స్థానాల్లో, ఉత్తరాఖండ్​లో 45 స్థానాల్లో, మణిపూర్​లో 25 స్థానాల్లో, గోవాలో 18 స్థానాల్లో లీడ్​లో ఉంది.

    పంజాబ్​లో మాత్రం ఆప్​ దూసుకెళ్తోంది. 88 స్థానాల్లో లీడ్​లో ఉంది.

    అయితే ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​కు ఓటమి తప్పేలా లేదని ప్రస్తుత ట్రెండ్స్ చెబుతున్నాయి. పంజాబ్​ వంటి కీలక రాష్ట్రం కూడా కాంగ్రెస్​ చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • ఉత్తరాఖండ్ ట్రెండ్స్: ఉత్తరాఖండ్ లో మెజారిటీ మార్కును దాటేసిన బిజెపి.. మొత్తం 70 స్థానాల్లో బిజెపి 44 స్థానాల్లో ఆధిక్యం ఉండగా.. కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
     

  • గోవా పోల్ ట్రెండ్స్: గోవా సగం స్థానాల్లో లీడ్ లో ఉన్న బీజేపీ... ఆధిక్యంలో ఉన్న సీఎం ప్రమోద్ సావంత్ 

     

  • పంజాబ్ ట్రెండ్స్: పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాలకు.. AAP 89 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో మరియు BJP 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

     

  • Assembly Election Results 2022 : మణిపూర్ లో బీజేపీ 9 అసెంబ్లీ స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యం 

     

  • మణిపూర్​ ట్రెండ్​..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    మణిపూర్​లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వస్తోంది. 12 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

    కాంగ్రెస్​ 5 సీట్లలో, జేడీ(యూ) 4 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.

  • గోవాలో బీజేపీ లీడ్​..

    గోవాలో బీజేపీ లీడ్​ కొనసాగుతోంది. 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 13 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎంజీపీ 5, ఆప్​ ఒక స్థానంలో లీడ్​లో ఉన్నట్లు ఎలక్షన్​ కమిషన్ డేటాలో వెల్లడైంది.

  • పంజాబ్​లో ఆప్​ జోరు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పంజాబ్​లో ఆప్​ జోరు కొనసాగుతోంది. మొత్తం 117 స్థానాలు ఉండగా.. 66 స్థానాల్లో ఆప్​ లీడ్​లో దూసుకెళ్తోంది.

    కాగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. 59 స్థానాలు అవసరం. విజయం దిశగా ఆప్​ దూసుకెళ్తున్న నేపథ్యంలో పంజాబ్​ ఆప్​ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్​ మాన్ ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి సంబరాలు జరుపుకుంటున్నారు.

  • లీడ్​లో ఆప్​..

    పంజాబ్​లో అమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) లీడ్​లోకి వచ్చింది. 117 స్థానాలకు గానూ 6 చోట్ల ఆప్​, రెండు చోట్ల శిరోమణి  అకాలీ దళ్​​, బీజేపీ ఒకచోట ఆధిక్యంలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్​ డేటాలో తేలింది.

  • రాష్ట్రాల వారీగా ట్రెండ్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఉత్తర్​ ప్రదేశ్​లో  బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​ సహా పలువురు కీలక అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

    పంజాబ్​లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పంజాబ్​ సీఎం చరణ్​జిత్ సింగ్ చన్నీ సహా పలువురు గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

    ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్​లలో ఆధిక్యం విషయంలో పోటా పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్​ మధ్య పోటీ కనిపిస్తోంది.

  • బీజేపీ జోరు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఉత్తరాఖండ్​లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 70లో 62 స్థానాలకు సంబంధించి ట్రెండ్​ను పరిశీలిస్తే.. బీజీపీ 36 స్థానాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది.

    కాంగ్రెస్​ 22 స్థానాల్లో, ఆప్​ 1 స్థానంలో, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • రాష్ట్రాల వారీగా మ్యాజిక్ ఫిగర్స్​..

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ ఉన్నాయి. విజయానికి కావాల్సింది 202 సీట్లు.

    • పంజాబ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 117 ఉండగా.. గెలిపుకోసం కనీసం 59 సీట్లు రావాల్సి ఉంటుంది.

    • ఉత్తరాఖండ్​లో మ్యాజిక్ ఫిగర్​ 36 సీట్లు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 70.

    • గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 21 స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంటుది.

    • మణిపూర్​లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 31 స్థానాలు గెలిస్తే అధికారం దక్కుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link