Karnataka Exit Poll 2023 Live : కర్ణాటక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Karnataka Exit Poll 2023 Live : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో కర్ణాటక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 2,613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..
Karnataka Election 2023 Live Updates: దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకిత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం 7 గంటల నుంచి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 5.2 కోట్ల మంది ఓటర్లు ఉన్న కర్ణాటకలో ఎన్ని కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేది ఇంకాసేపట్లో తేలిపోనుంది. మొత్తం 224 స్థానాల్లో 2,613 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 9.17 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కు పొందారు. కర్ణాటక ప్రజలు ఎవరికి పట్టం కడతారోనని దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest Updates
Karnataka Exit Poll 2023 Live: కర్ణాటక ఎన్నికలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగ్గా.. మే 13న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, అంతకంటే ముందుగా నేడు పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు ఆ ఫలితాలను విడుదలచేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల సరళి ఎలా ఉందో తెలియాలంటే ఇదిగో ఈ పూర్తి వార్తా కథనం చదవాల్సిందే.
కర్ణాటకలో మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే
కర్ణాటకలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం పోలింగ్ నమోదైంది.Karnataka Election 2023: హెలీక్యాప్టర్‌లో వచ్చి ఓటేసిన మాజీ ప్రధాని.. వీడియో వైరల్
కర్ణాటక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ తన భార్య చన్నమ్మతో కలిసి హెలీక్యాప్టర్‌లో గ్రామానికి వచ్చారు. దీంతో దేవేగౌడ హెలీక్యాప్టర్‌లో వచ్చారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మైసూర్ ఎలక్షన్ అంబాసిడర్ జవగల్ శ్రీనాథ్
జవగళ్ శ్రీనాథ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తోన్న ప్రభుత్వం.. వివిధ రంగాల ప్రముఖులచేత ఓటు హక్కు ప్రాధాన్యత తెలిసేలా క్యాంపెయిన్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జవగళ్ శ్రీనాథ్ మైసూరు జిల్లా ఎలక్షన్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని.. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జవగళ్ శ్రీనాథ్ కోరారు.మేమే కింగ్ మేకర్స్ అంటున్న జేడీఎస్ పార్టీ:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎవరికి వారే తమ విజయంపై ధీమా వ్యక్తంచేస్తున్నాయి. ఎవ్వరి మద్దతు, పొత్తుతో పని లేకుండానే తాము విజయం సాధిస్తామని బీజేపి, కాంగ్రెస్ ధీమా వ్యక్తంచేస్తుండగా.. జనతా దళ్ (సెక్యులర్) మాత్రం తామే కింగ్ మేకర్స్ అవుతామనే ధీమాలో ఉంది. తమ సహాయం లేకుండా ఎవ్వరూ అధికారంలోకి రారు అనే నమ్మకం జేడీఎస్ పార్టీలో కనిస్తోంది.ఎన్నికల తరువాత జేడీఎస్ పార్టీతో పొత్తుపై స్పందించిన డికే శివ కుమార్:
కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల తరువాత జేడీఎస్ పార్టీతో పొత్తుపై కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివ కుమార్ స్పందిస్తూ.. ఎన్నికల తరువాత జేడీఎస్ తో పొత్తు ఉండదు అని స్పష్టంచేశారు. తమ కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ మెజారిటీ వస్తుందని.. ఎవ్వరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు ఉండదని శివ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఇంకా సమయం ఉంది.
బసవన్ బాగేవాడి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ కన్నడ ప్రాథమిక పాఠశాల శంకర్ నగర్‌లోని ఎల్‌టీసీ లంబాణి కులాల పోలింగ్ కేంద్రంలో సీనియర్ సిటిజన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వయోభారంతో ఎంతో కష్టపడి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని.. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
బెంగళూరులోని నృపతుంగ రోడ్‌లోని నిసర్గ హోటల్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించారు. ఓటు వేసిన వచ్చిన వారికి ఉచిత బట్టర్ దోస, మైసూర్ పాక్ తినేసి వెళ్లొచ్చని తెలిపారు. మొదటి 100 మంది యువ ఓటర్లకు ఈ అవకాశం అని చెప్పారు. ఓటింగ్‌ను ప్రోత్సహించేందుకు హోటల్ ఈ ఆఫర్‌ను ఇచ్చింది. ఓటు వేసిన తర్వాత ఓటర్లు హోటల్ వైపు వెళ్తున్నారు.
జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఓటు వేశారు.
ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని నటుడు కిచ్చా సుదీప్ కోరారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకోడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి ఓటు వేస్తున్న ఆర్‌డబ్ల్యూఏ సభ్యురాలైన వృద్ధురాలు బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పెళ్లి దుస్తులు ధరించి.. నుదుట బాసికాలు, మెడలో పూల దండలతో వచ్చి ఓ కొత్త జంట తమ ఓటు హక్కు వినియోగించుకుంది.
విజయపూర్ జిల్లా బసవన్ బాగేవాడి తాలూకా మసబినాల గ్రామంలో ఓటింగ్ యంత్రాలను గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు ధ్వంసమయ్యాయి. దోనూర గ్రామం బిసనాల నుంచి రిజర్వ్‌డ్ ఓటింగ్ యంత్రాలను తిరిగి విజయపురానికి తీసుకురాగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ ప్రక్రియను సగంలోనే నిలిపివేసి వెనక్కి తీసుకున్నారని పొరపాటున ఓటింగ్ యంత్రాన్ని పగలగొట్టారు. అధికారుల కారు కూడా ధ్వంసమైంది. సిబ్బందిని కూడా కొట్టడంతో మసబినాల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఓటు వేసి బయటకు వచ్చిన వ్యక్తి మృతి చెందిన సంఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా చిక్కోల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓటు వేసి బయటకు జయన్న(49) అనే వ్యక్తి.. పోలింగ్ కేంద్రం ఆవరణలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
ఇవే తనకు చివరి ఎన్నికలు అని కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య అన్నారు. బుధవారం ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. తనకు ఎన్నికల్లో 60 శాతానికిపై ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. తాను రాజకీయాలను వీడనని.. కానీ వచ్చే ఎన్నికల నుంచి పోటీ చేయయని స్పష్టం చేశారు.
కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ వ్యక్తి అంబులెన్స్‌లో వచ్చాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శేషాద్రి(40).. తిలక్ నగర్‌లోని సాగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓటు వేసేందుకు ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు ఆర్‌ఆర్‌నగర్‌కు వెళ్లాడు.
బళ్లారి గ్రామీణ అసెంబ్లీ స్థానంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకుడు ఉమేశ్ యాదవ్ ఓటు వేసేందుకు వెళుతుండగా.. బీజేపీ నాయకులు దాడికి దిగారు. ఇటీవల వరకు బీజేపీలో ఉన్న ఆయన.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షన వాతవారణం నెలకొంది.
కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లో గ్యాస్ సిలిండర్లకు వారు పూజలు చేశారు. అంతేకాదు దండలు వేసి, అగరువత్తులు కూడా వెలిగించారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టారు.
కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. రాష్ట్ర మంచి భవిష్యత్ కోసం తాను ఓటు వేశానని ఆయన చెప్పారు. ప్రజలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగంచుకోవాలని కోరారు.
అమెరికా నుంచి ఓ మహిళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. కార్వార్ షిర్సీలోని బెట్టడకొప్పకు చెందిన అశ్విని రాజశేఖర భట్ తన స్వగ్రామానికి సమీపంలోని కానగోడ్ పోలింగ్ కేంద్రం వద్ద తన హక్కును వినియోగించున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 141 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తామని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 20.94 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
40 శాతం కమిషన్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు కర్ణాటక ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు 8.26 శాతం పోలింగ్ నమోదైంది.