Central government issues guidelines for loan interest waiver: న్యూఢిల్లీ: కరోనా లౌక్‌డౌన్‌ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి..నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మారటోరియం గడువు అదేవిధంగా వడ్డీ మాఫీ తదితర అంశాలపై సుప్రీంకోర్టు ( Supreme Court of India ) లో విచారణ సైతం జరిగింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహితల (customers) కు పండుగ శుభవార్త వెల్లడించింది. అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ ( interest waiver ) కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central government) బంపర్ ఆఫర్ ప్రకటించింది.  Also read: Navratri Day 8: దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినీగా అమ్మవారి దర్శనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై వీలైనంత త్వరగా వడ్డీ మినహాయింపును అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు.. కేంద్రాన్ని ఆదేశించిన తరువాత తాజాగా ఈ మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్థికమంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. ఆరు నెలల కాలానికిగాను (2020 మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు)  2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ


ఈ మేరకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్‌లో జమ చేస్తాయి. అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకోనున్నాయి. రుణగ్రహీతలు పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని రుణ సంస్థలు.. రుణ గ్రహీతల అకౌంట్లల్లో జమచేయనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe