Navratri Day 8: దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినీగా అమ్మవారి దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైవున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మేరకు భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.

Last Updated : Oct 24, 2020, 10:38 AM IST
Navratri Day 8: దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినీగా అమ్మవారి దర్శనం

Navratri 2020 day 8: Worship sri durga devi and mahishasura mardini: న్యూఢిల్లీ: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైవున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మేరకు భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం నాడు (తిథి ద్వయం కారణంగా) ఆశ్వియుజ శుద్ధ అష్టమి, మహర్నవమి కలిసిరావడంతో (Navratri Day 8) శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ శ్రీ దుర్గాదేవిగా ( sri durga devi), మహిషాసురమర్ధినీ (mahishasura mardini) గా రెండు రూపాలల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. సాక్షాత్తూ ఆది పరాశక్తిగా దుర్గమ్మ.. అష్టమి నాడు (దుర్గాష్టమి) శ్రీ దుర్గాదేవిగా, నవమినాడు మహిషాసురమర్దినీగా తిథి ద్వయం కారణంగా ఒకేరోజు అమ్మవారు అనుగ్రహించనుంది. కావున ఈ రోజు భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు.

durga-devi-mahishasura-mardini

దుర్గాష్టమి (Durga Ashtami) రోజున దుర్గతులను దూరం చేసే మహాగౌరి (Mahagauri) శ్రీ దుర్గా దేవిని దర్శించుకుంటే.. భయం దూరమై శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు అమ్మవారు ఎరుపురంగు చీరను ధరించి నాలుగు భుజములతో భక్తులను అనుగ్రహిస్తుంది. చేతుల్లో త్రిశూలం, కమండలం, అభయం, రక్షణ ఇచ్చే ముద్రలతో సింహవాహినిగా దర్శనమిస్తుంది. మహాశక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి రోజున రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది. ఈ దుర్గాదేవి ఆది ప్రకృతి.. పంచ మహా స్వరూపాల్లో మొదటిది. కావున ఈ తల్లిని పూజించడం వల్ల సమస్త గ్రహ బాధలు, దుష్ట గ్రహ బాధలన్నీ తొలగిపోయి సకల సౌభాగ్యాలతోపాటు మనశ్శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. కావున అమ్మవారికి పూర్ణం బూరెలు, పాయసం, చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పించి శ్రీ దుర్గాదేవిని పూజిస్తారు.  Also read: Navratri 2020: నవరాత్రి సమయంలో తీసుకోవాల్సిన 5 సాత్విక పానీయాలు

అమ్మవారి అనుగ్రహానికి ఈ శ్లోకాన్ని పఠించండి..
‘‘ దుర్గేస్మృతా హరసి భీతి మశేషజంతో: 
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాందదాసి

దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా 
సర్వోపకారకరణాయ సదార్ధ్ర చిత్తా ’’
ఓం శ్రీ దుర్గాదేవతాయై నమ:..

sri durga devi avataram

ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ కనకదుర్గా దేవి భక్తులకు సాక్షాత్తూ.. శ్రీ దుర్గా దేవీగా, మహిషాసురమర్ధినీ దేవీగా దర్శనమివ్వనుంది. విజయవాడ ఇంద్రకీలాద్రీపై వెలసిఉన్న శ్రీ కనక దుర్గమ్మను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దీంతోపాటు ఇరు రాష్ట్రాల్లోని వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు చేరుకొని అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం పరితపిస్తున్నారు.  Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News