Lockdown Details: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఓ వైపు దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు డిమాండ్ పెరుగుతుంటే..మరోవైపు చాలా రాష్ట్రాలు అదే బాటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉంది..ఎక్కడ ఏ అంక్షలున్నాయనే వివరాలివీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) దేశంలో ఓ పెనురక్కసిలా భయపెడుతోంది. అదుపు తప్పిన వైరస్ ప్రతాపానికి దేశం అల్లకల్లోలంగా మారింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు వస్తున్నాయా అనేంతగా పరిస్థితి భయపెడుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ ఓ వైపు వస్తుంటే..కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ అవసరం లేదని చెబుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తుంటే..కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నైట్‌కర్ఫ్యూ(Night Curfew) అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో లాక్‌డౌన్(Lockdown) అమల్లో ఉంది, ఎప్పటి వరకూ అమల్లో ఉంటుంది...ఎక్కడ ఏ ఆంక్షలున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.


ఆంధ్రప్రదేశ్‌లో పాక్షిక కర్ఫ్యూ ( Partial curfew) రెండు వారాల పాటు అమల్లో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల్నించి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ పూర్తిగా కర్ఫ్యూ ఉంటుంది. ఇక తెలంగాణలో ఈనెల 8వ తేదీ వరకూ నైట్‌కర్ఫ్యూ ఒక్కటే అమల్లో ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో మే 10 వ తేదీ వరకూ లాక్‌డౌన్ కాగా బీహార్‌లో మే 15 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో మే 7వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధించగా..హర్యానాలో మే 10 వరకూ లాక్‌డౌన్ ఉంటుంది. ఒడిశాలో మే 19 వరకూ లాక్‌డౌన్ కాగా..రాజస్తాన్ లో మే 17 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కర్నాటకలో మే 12 వరకూ లాక్‌డౌన్ కాగా..జార్ఘండ్ లో మే 6 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మే 5వ తేదీ వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. పంజాబ్‌లో మే 15 వరకూ నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంటే..గుజరాత్‌లో 23 నగరాల్లోనే నైట్‌కర్ఫ్యూ కొనసాగుతోంది. మహారాష్ట్రలో మే 15 వరకూ లాక్‌డౌన్ (Lockdown) ఉంటుంది. గోవాలో మే 3 వరకూ కర్ఫ్యూ ఉంటుంది. తమిళనాడులో మే 20 వరకూ కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు కేరళ రాష్ట్రంలో మే 9 వరకూ కఠిన లాక్‌డౌన్ అమలవుతుంది. పుదుచ్చేరిలో మే 10 వరకూ లాక్‌డౌన్ కాగా, అస్సాంలో మే 7 వరకూ నైట్‌కర్ఫ్యూ కొనసాగనుంది. నాగాలాండ్ రాష్ట్రంలో మే 14 వరకూ పాక్షిక లాక్‌డౌన్ ( Partial lockdown) అమలు కాగా..మిజోరాంలో మే 3 నుంచి కొన్ని జిల్లాల్లోనే లాక్‌డౌన్ ఉంటుంది. ఇక జమ్మూకాశ్మీర్‌లో మే 6 వరకూ 4 జిల్లాల్లో లాక్‌డౌన్ కాగా..మిగిలిన ప్రాంతాల్లో నైట్‌కర్ఫ్యూ అమలవుతుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రాల్లో కూడా నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 


ఒకవేళ తెలంగాణ నుంచి ఏపీ ( Andhra pradesh) కు రావాలంటే మద్యాహ్నం 12 గంటల్లోపే బోర్డర్ దాటాల్సి ఉంటుంది. లేకపోతే 18 గంటల పాటు బోర్డర్ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఏపీ నుంచి తెలంగాణ వెళ్లాలంటే కూడా మద్యాహ్నం 12 లోగా బోర్డర్ దాటేయాలి. ఎందుకంటే సరిగ్గా మద్యాహ్నం 12 గంటలకు బోర్డర్ మూసేస్తున్నారు. 


Also read: Tamilnadu: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, సరఫరా లేక 11 మంది కరోనా బాధితులు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook