3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..
Lok Sabha Polls 2024 3rd Phase: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో విడత ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. నిన్నటితో (5-5-2024)న లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ ప్రచారానికి తెర పడింది. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లోని 25 లోక్ స్థానలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలతో పాటు దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ సీట్లకు రేపు పోలింగ్ జరనుంది.
Lok Sabha Polls 2024 3rd Phase: దేశ వ్యాప్తంగా 18 లోక్ సభకు సంబంధించి 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19న 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అటు రెండో విడతలో భాగంగా.. 88 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో మూడో విడతలో భాగంగా రేపు (5-5-2024)న దేశ వ్యాప్తంగా గుజరాత్, కర్ణాటక, అస్సామ్, బిహార్, మహా రాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గోవా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ సహా 10, రెండో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 92 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికలతో దేశంలో గుజరాత్, అస్సామ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఈ మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో గుజరాత్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రుడు జ్యోతిరాధిత్య సింధియా (గుణ - మధ్య ప్రదేశ్) నుంచి బరిలో ఉన్నారు. పురుషోత్తం రూపాల రాజ్‌కోట్ నుంచి బరిలో ఉన్నారు. ప్రహ్లాద్ జోషి.. కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు మధ్య ప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిశ నుంచి బరిలో ఉంటే.... రాజ్ ఘర్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ ఉన్నారు. అటు కర్ణాటకలోని హవేరి నుంచి బసవరాజ్ బొమ్మై బరిలో ఉన్నారు.ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌కు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. దీంతో పాటు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన రెండో స్థానాలకు తర్వాత విడతలో ఎన్నికల నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది.
ఈ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 283 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో నాలుగు విడతల్లో 262 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also read: Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter