Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ఇంకెంతో సమయం లేదు. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేఫథ్యంలో పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఇప్పిటకే ప్రచారాన్ని కూడా మెుదలుపెట్టేశాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ పార్టీ ఢిలీల్లోని ఏడు లోక్‌సభ స్థానాలపై చర్చలు ప్రారంభించింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరియు కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. నాలుగు స్థానాల్లో ఆప్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగబోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014, 2019లో దేశ రాజధానిలోని ఏడు పార్లమెంటు స్థానాలను బీజీపీ గెలుచుకుంది. మళ్లీ హిస్టరీ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎంపీలను పునారావృతం చేయాలా వద్దా అనే విషయంపై మేధోమథనం చేస్తోంది. ఈ సారి పాతవారినీ పక్కన పెట్టి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తుంది.  మరోవైపు ఆప్-కాంగ్రెస్ కూటమి ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. 


Also Read: Anasuya: సందీప్ రెడ్డికి, గౌతమ్ మీనాన్ కి మధ్య తేడా అదే.. అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్


ఆప్-కాంగ్రెస్ కూటమిని ఢీకొట్టేందుకు బీజేపీ ఓ స్టార్ హీరోను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. స్థానికతను దృష్టిలో ఉంచుకుని ఓ లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)ని  బరిలో నిలపబోతుందని సమాచారం. అక్షయ్‌ చాందినీ చౌక్‌ (Chandni Chowk) నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పార్టీనేతలు అక్షయ్ తో చర్చించనట్లు తెలుస్తోంది.  బీజేపీ సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 2014 మరియు 2019లో రెండుసార్లు ఈ స్థానం నుంచే గెలుపొందారు.  అక్షయ్ పోటీ చేసే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 


Also read: Ruhani Sharma: అందాల విందు చేసిన కోహ్లీ మరదలు.. ఇలా ఎప్పుడు చూసుండరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook