Anasuya: సందీప్ రెడ్డికి, గౌతమ్ మీనాన్ కి మధ్య తేడా అదే.. అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Sandeep Reddy Vanga: సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉంటుంది అనసూయ.‌ తనకు ఏదన్నా తప్పు అనిపిస్తే చాలు అది వెంటనే పోస్ట్ చేసి తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఇద్దరు దర్శకుల గురించి షేర్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2024, 06:19 PM IST
Anasuya: సందీప్ రెడ్డికి, గౌతమ్ మీనాన్ కి మధ్య తేడా అదే.. అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Gautham Menon: సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ మీనన్.. ఈ ఇద్దరు దర్శకులకు కూడా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా వీరిద్దరి సినిమాలను ఆదరిస్తూ ఉంటారు సినీ ప్రేక్షకులు. ఇద్దరూ కూడా తమ తమ స్థాయిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఏం మాయ చేసావే.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి క్లాస్ లవ్ స్టోరీస్ అందిస్తే.. సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి.. యానిమల్ లాంటి వైల్డ్ లవ్ స్టోరీస్ అందించారు. అయితే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమాలే. 

ఈ నేపథ్యంలో వీరిద్దరినీ కంపేర్ చేస్తూ యాంకర్ అనసూయ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనసూయ కి మొదటి నుంచి సందీప్ రెడ్డి సినిమాలు నచ్చవు అనే సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రం విడుదలైనప్పుడే ఆమె ఆ చిత్రంపై ఎన్నో విమర్శలు కురిపించింది. తాజాగా ఆమె సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలకు, గౌతమ్ మీనన్ మాట్లాడిన మాటలను పోల్చి చెప్పే ఒక వీడియో షేర్ చేసి మరోసారి సందీప్ రెడ్డి ని ఇన్ డైరెక్ట్ గా తిడుతూ…గౌతమ్ మీనన్ చాలా గొప్పవాడు అన్నట్టుగా చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. సందీప్ రెడ్డి సినిమాలో హీరోయిన్స్ ని కొట్టడం, ఆ తిట్టడం ఏంటి? అంటూ చాలానే విమర్శలు వచ్చాయి. వీటిపై సందీప్ రెడ్డి ఈ వీడియోలో మాట్లాడుతూ..’ అసలు ఒక రిలేషన్‌లో తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి లేకపోతే అది ప్రేమే కాదు, ఒక రిలేషన్షిప్ గీత గీసుకుని జీవిస్తున్నట్టే. అది అసలు ప్రేమే కాదు’ అని సందీప్ రెడ్డి తన వర్షెన్‌ను వినిపించాడు. కట్ చేస్తే సందీప్ రెడ్డి క్లిప్ అవ్వగానే అదే వీడియోలో గౌతమ్ మీనన్ గతంలో కొన్ని కామెంట్లు చేసిన క్లిప్ కూడా ఉంది. ‘అసలు ఓ అమ్మాయి పైన మీకు నిజమైన ప్రేమ ఉంటే.. వాళ్లని బలవంతం పెట్టొద్దు.. చెడుగా మాట్లాడొద్దు.. ఓ రిలేషన్‌లో ఒడిదొడుకులుంటాయ్. కానీ కోపాన్ని మాత్రం వారి మీద ఇష్టమొచ్చినట్టుగా చూపించకూడదు.. మనం చాలా డిగ్నిటీగా వ్యవహరించాలి.. ఆధిపత్యం చూపించకూడదు.. కోపంలో ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తాం. తప్పులు చేస్తాం.. కానీ అలా చేయకూడదు. మన పార్ట్నర్ పైన ఎప్పుడూ కూడా మనం చేయి ఎత్తకూడదు.. ప్రేమగా చెప్పాలి.. మనం శూన్యం.. వాళ్లే సర్వస్వం.. అదే నిజం’.. అని ఎంతో గొప్పగా చెప్పాడు  గౌతమ్ మీనన్.

ఈ రెండు వీడియోలు గల క్లిప్ ని అనసూయ షేర్ చేస్తూ..సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ్లున్న ఈ ప్రపంచంలో గౌతమ్ మీనన్ లాంటి వాళ్లు కూడా ఉన్నారంటూ ఇన్ డైరెక్ట్ గా సందీప్ రెడ్డి పైన సెటైర్ వేసింది. ఇక ఈ వీడియో మరోసారి అనసూయ కి సందీప్ రెడ్డి చిత్రాల పైన.. ఆయన ఆలోచన విధానం పైన ఉందే ఆగ్రహాన్ని చెప్పకనే చెప్పింది.

 

Read More: Rashmika-Vijay Devarakonda: ‘నీకోసం నేను వాళ్లను స్పెషల్ గా తీసుకువస్తాను’.. రష్మికకి విజయ్ దేవరకొండ రిప్లై

Read More: Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News