LPG Cylinder Price: ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర...
LPG Commercial Cylinder Price Today: ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్... గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు భారీగా తగ్గించాయి.
LPG Commercial Cylinder Price Today: ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) బిగ్ రిలీఫ్ ప్రకటించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.91.50 మేర తగ్గించాయి. తగ్గిన ధర నేటి నుంచే అమలులోకి రానుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల తాజా నిర్ణయంతో ఇదివరకు ఢిల్లీలో రూ.1976.07గా ఉన్న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1885కి దిగొచ్చింది.
ముంబైలో ఇదివరకు రూ.1936.50గా ఉన్న ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1844కి దిగొచ్చింది. కోల్‌కతాలో రూ.2095.50 నుంచి రూ.1995.50కి, చెన్నైలో రూ.2141 నుంచి రూ.2045కి ధర దిగొచ్చింది. తగ్గిన ధరలు చిరు వ్యాపారులకు భారీ ఊరట అనే చెప్పాలి. గత కొద్ది నెలలుగా ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. జూలైలో రూ.135, ఆగస్టులో రూ.36 మేర తగ్గిన ధర ఇప్పుడు మరో రూ.91.50 మేర తగ్గింది.
గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధర మాత్రం స్థిరంగా ఉంది. సాధారణంగా ప్రతీ నెలా మొదటి తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. ఇవాళ సెప్టెంబర్ 1వ తేదీ కావడంతో కమర్షియల్ సిలిండర్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: Video: ఫెయిల్ చేశాడని.. మ్యాథ్స్ టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook