Bus Fired: మధ్యప్రదేశ్‌లోని గుణాలో బంపర్ ఢీ కొనడంతో బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి. దాంతో 12 మంది ప్రయాణీకులు అక్కడికక్కడే సజీవ దహనం కాగా మరో 10 మందికి గాయాలయ్యాయి. ఇంకొందరు క్షేమంగా బయటపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 27 బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో గుణ నుంచి ఆరోన్ వెళ్తున్న బస్సు గుణ జిల్లాలోనే బంపర్ ఢీ కొని బోల్తాపడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 మంది సజీవ దహనమయ్యారు. 11 మంది మృతదేహాల్ని వెలికి తీశారు. మరో 10 మందికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య పెరగవచ్చని అంచనా. స్థానిక ప్రజలు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా మంటల్లోంచి ప్రయాణీకుల్ని రక్షించారు. బస్సు గుణ నుంచి ఆరోన్ వేపు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ప్రమాదం జరిగిందని..తనను ఎవరో ముగురు నలుగురు బస్సు నుంచి బయటకు తీశారని బస్సులోని ప్రయాణీకుడొకడు చెప్పాడు. ఆ తరువాత బస్సులోంచి మంటలు చెలరేగడంతో ఎవరూ బయటకు రాలేకపోయినట్టు తెలిపాడు. గుణ జిల్లా సెమ్రీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 30మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. 


బస్సు ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదేశించారు. ఈ తరహా ప్రమాదాలు తరచూ జరగకుండా చూడాలని రవాణా శాఖ అధికారుల్ని ఆదేశించారు. బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షలు, గాయపడివారికి 50 వేల రూపాయలు సహాయం ప్రకటించారు. ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ట్వీట్ చేశారు. మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. 


Also read: Delhi Visibility: ఢిల్లీని దట్టంగా కమ్మేస్తున్న పొగమంచు, విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook