COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Assembly Elections 2023 Exit Poll Results: ఎక్కువ సర్వేలు తెలంగాణలో అధికారం కాంగ్రెస్‌దే అని చెప్పిగా జాతీయ స్థాయిలో మాత్ర భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న  మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం  హోరాహోరీ పోటీ తప్పదని మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ చేతుల్లో నుంచి రాజస్థాన్ చేజారడం ఖాయమని సర్వేలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా మిజోరంలోనూ హంగ్ వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నట్లు పలు సంస్థలు వెల్లడించడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే సర్వే సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్!
మధ్యప్రదేశ్‌కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ABP-C ఓటర్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 116 మ్యాజిక్ ఫిగర్ సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది. కాంగ్రెస్ 125 సీట్లతో అధికారం చేపడుతుందని  ABP-C ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే పేర్కొంది. బీజేపీకి 100, బీఎస్పీకి 2, ఇతరులకు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.


రాజస్థాన్‌లో బీజేపీదే అధికారం..NDTV-జన్ కీ బాత్ సర్వే: 
రాజస్థాన్‌లో బీజేపీ అధికారం చేపట్టనుందని NDTV-జన్ కీ బాత్ సర్వే ఫలితంలో వెల్లడైంది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా..ఈసారి బీజేపీ 100-112 సీట్లతో పూర్తి మెజార్టీ సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 62-58 సీట్లకే పరిమితం అవుతుందని తెలిపింది. ఇక బీఎస్పీ ఖాతానే తెరవదని తేల్చి చెప్పింది. రాజస్థాన్‌లో ఇతరులు 14-15 సీట్లు గెలుస్తారని చెప్పింది. 


మిజోరంలో హంగ్: పీపుల్స్ సర్వే
మిజోరంలో అధికార పార్టీ మిజోరం నేషనల్ ఫ్రంట్(MNF)కు అత్యధిక స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. తాజాగా వెల్లడించిన సర్వేలో అత్యధికంగా MNFకు 16-20, కాంగ్రెస్‌కు 6-10, ఇతరులకు 10-17 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోగా..హంగ్ ఏర్పడే అవకాశముందని తెలిపింది. దీంతో కాంగ్రెస్ లేదా ఇతరులు కింగ్ మేకర్‌గా మారే అవకాశముందని రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


ఛత్తీస్ గఢ్‌లో హోరాహోరీ: 
తెలంగాణలో కాంగ్రెస్‌  అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వే సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఇందుకు భిన్నంగా ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్గడ్‌లో హోరాహోరీ పోటీ తప్పదని మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ చేతుల్లో నుంచి రాజస్థాన్ చేజారడం ఖాయమని సర్వేలు పేర్కొన్నాయి. మిజోరంలోనూ హంగ్ వచ్చే అవకాశముందని పలు సంస్థలు వెల్లడించాయి.


ఛత్తీస్‌గఢ్‌లో పలు సర్వేల అంచనాలు ఇలా.. 
ఏబీపీ న్యూస్‌ సీఓటర్‌: భాజపా 36 నుంచి 48, కాంగ్రెస్‌ 41 నుంచి 53
న్యూస్‌ 24-టుడేస్‌ చాణక్య: భాజపా 33, కాంగ్రెస్‌ 57, ఇతరులు 0
టీవీ9 భారత్‌వర్ష్‌-పోల్‌స్ట్రాట్‌: భాజపా 35 నుంచి 45, కాంగ్రెస్‌ 40 నుంచి 50
ఇండియా టుడే -యాక్సిస్‌ మై ఇండియా: భాజపా 36 నుంచి 46, కాంగ్రెస్‌ 40 నుంచి 50
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌: భాజపా 34 నుంచి 45, కాంగ్రెస్‌ 42 నుంచి 53
రిపబ్లిక్‌ టీవీ-మ్యాట్రైజ్‌: భాజపా 34 నుంచి 42, కాంగ్రెస్‌ 44 నుంచి 520


సర్వేల అంచనాలు ఇలా:
రాజస్థాన్‌(199)లో బీజేపీకి: 95 నుంచి 115, కాంగ్రెస్‌: 73 నుంచి 95, ఇతరులు: 8 నుంచి 21 
మిజోరం(40): ఎంఎన్‌ఎఫ్‌: 16-20; కాంగ్రెస్‌ 6 నుంచి 10, ఇతరులు: 12 నుంచి 17
మధ్యప్రదేశ్‌(230): బీజేపీ: 91 నుంచి 113, కాంగ్రెస్‌: 117 నుంచి 139, ఇతరులు: 0 నుంచి 8
ఛత్తీస్‌గఢ్‌(90): బీజేపీ: 29 నుంచి 39, కాంగ్రెస్‌: 54 నుంచి 64, ఇతరులు: 0 నుంచి 2


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి