భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు ( CM Shivraj Singh Chouhan ) కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రజలకు ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. తనకు క‌రోనావైరస్ ల‌క్ష‌ణాలు ( Coronavirus symptoms ) క‌నిపించ‌డంతో కొవిడ్-19 ప‌రీక్ష‌లు చేయించుకున్నానని... ఆ ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌ అని తేలిందని శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన ఆయన.. ఆస్పత్రిలో కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారని.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం


తనకు కరోనావైరస్ వచ్చినందున ఇటీవల కాలంలో తనను క‌లిసిన స‌హ‌చ‌రులంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు ( COVID-19 tests ) చేయించుకోండి అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తనతో స‌న్నిహితంగా ఉన్న వాళ్లు త‌ప్ప‌నిస‌రిగా క్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా శివరాజ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు.



Also read: COVID-19: ఏపీలో 24 గంటల్లో 7,813 కరోనా కేసులు, 52 మంది మృతి