Madras High Court: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌పై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐను పంజరంలో బంధించిన చిలుకగా అభివర్ణించింది. స్వయం ప్రతిపత్రి కల్పించాలని సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులోని(Tamilnadu)పోంజి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ బీ పుగళేందిల ధర్మాసనం సీబీఐపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్షన్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐ మరింత స్వయంప్రతిపత్తిగా ఉండాలని వ్యాఖ్యానించింది. సీబీఐ నేరుగా ప్రధానమంత్రికి నివేదించేట్టు ఉండాలని సూచించింది. సీబీఐను పంజరంలో బధించిన చిలకగా అభివర్ణించింది. సీబీఐకు ఎక్కువ అధికారాలు, చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలో తీసుకుని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని(Central government)కోరింది. పార్లమెంట్‌కు మాత్రమే జవాబుదారీగా ఉండే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌లా సీబీఐకు స్వయం ప్రతిపత్తి ఉంటేనే ఆ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వ్యాఖ్యానించింది. 


సీబీఐ వ్యవస్థను సరిదిద్దేందుకు తాము చేసిన 12 సూచనలతో పంజరంలో ఉన్న చిలుకను విడిపించే ప్రయత్నం చేస్తున్నామని మద్రాస్ హైకోర్టు తెలిపింది. చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే స్వయం ప్రతిపత్తి నిర్ధారించగలమని న్యాయస్థానం గమనించింది. దీనివల్ల సీబీఐ(CBI)పై ప్రభుత్వ పరిపాలన నియంత్రణ ఉండదని స్పష్టం చేసింది. ఈ అంశంపై నెలరోజుల్లోగా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు(Madras High Court)సూచించింది. 


Also read: Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్‌లో 39 ఏళ్ల రికార్డు సమం చేసిన టీమ్ ఇండియా పేసర్ సిరాజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook