కరోనా వైరస్ ( Corona Virus ) ను గుర్తించేందుకు ఇప్పుడు కొత్త రకం పరికరం అందుబాటులో వస్తోంది. దేశీయంగా రూపొందించిన ఈ బ్యాండ్ ( Wrist Band ) ధరిస్తే చాలు కరోనా వైరస్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ ను సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు వివిధ రకాల పరికరాలు మార్కెట్ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా లక్షణాల్ని ( Covid19 Symptoms ) ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. అందుకే ప్రతిష్టాత్మక చెన్నై ఐఐటీ ( IIT ) కొత్త రకం పరికరాన్ని త్వరలో మార్కెట్ లోకి తేనుంది. పూర్తిగా దేశీయంగా తయారైన ఈ పరికరం కేవలం ఒక బ్యాండ్ అంతే. దీన్ని చేతి రిస్ట్ కు కట్టుకుంటే చాలు..సదరు వ్యక్తి శరీర ఉష్ణోగ్రతతో పాటు గుండె, ఆక్సిజన్, రక్తం పనితీరును పూర్తిగా తెలుసుకోవచ్చు. Also read: Ram Nath Kovind: రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి


ప్రతిష్టాత్మకమైన మద్రాస్ ఐఐటీ ( Madras IIT ), మ్యుుస్ నియర్ బేల్స్ అనే ఓ స్టార్టప్ సంస్థ సంయుక్తంగా కరోనా లక్షణాల్ని గుర్తించే బ్యాండ్ ను త్వరలో మార్కెట్ లో తీసుకురానున్నాయి. ఈ బ్యాండ్ ధరను 3 వేల 5 వందల రూపాయలుగా నిర్ణయించారు. ఇదే బ్యాండ్ ను మొబైల్ ఫోన్, బ్లూటూత్ లతో అనుసంధానించవచ్చు. ఈ బ్యాండ్ ధరించిన వ్యక్తి కంటైన్ మెంట్ జోన్ లో ప్రవేశించగానే ఆరోగ్య సేతు యాప్ ను అలర్ట్ చేస్తుంది. ఈ ఏడాదికి 2 లక్షల బ్రాండ్ అమ్మకాలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని...వచ్చే యేడాదికి దీన్ని 10 లక్షలకు పెంచుతామని మ్యుస్ నియర్ బేల్స్- మద్రాస్ ఐఐటీ తెలిపాయి. Also read: IIT Kharagpur: రూ.400లకే కరోనా టెస్టు..