Maharashtra: దాడులెందుకు..ధైర్యముంటే నేరుగా పోరాడమని సవాలు విసిరిన ఉద్ధవ్ థాక్రే
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ ముసుగులో దాడులెందుకని..ధైర్యముంటే నేరుగా పోరాడాలని సవాలు విసిరారు. దసరా మేళా సందర్భంగా కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ ముసుగులో దాడులెందుకని..ధైర్యముంటే నేరుగా పోరాడాలని సవాలు విసిరారు. దసరా మేళా సందర్భంగా కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక బీఎంసీ ఎన్నికల(BMC Elections)ప్రచారానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శంఖం పూరించారు. మాటుంగాలో నిర్వహించిన దసరా మేళా సందర్భంగా శివసేన(Shivsena)కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తూ..కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలోని మంత్రులపై ఈడీ, సీబీఐ, ఐటీ ముసుగులో దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధైర్యముంటే నేరుగా పోరాడాలని సవాలు విసిరారు. కరోనా మహమ్మారి దృష్టిలో ఉంచుకుని దసరా మేళాను సాదాసీదాగా నిర్వహించారు. కీలకమైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్యులు దాదాపు వేయిమందితోనే దసరా మేళా నిర్వహించారు.
మహారాష్ట్రలో(Maharashtra)కుల, మత, మరాఠీ, మరాఠేతర బేధాల్ని పక్కనబెట్టి..హిందూవులంతా ఒక్కతాటిపై రావల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ధవ్ థాక్రే పిలుపునిచ్చారు. హిందూవులకు ఎలాంటి ప్రమాదం లేదని..ఇటువంటివారి వల్లనే ప్రమాదం పొంచి ఉందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ఎన్ని కుయుక్తులు, పన్నాగాలు పన్నినా..ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొనసాగుతుందని థాక్రే స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో జరగనున్న బీఎంసీ ఎన్నికల్లో మరాఠీ, మరాఠేతర విభేదాలు సృష్టించి ప్రజల్లో చీలిక తెచ్చే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. హరహర మహాదేవ్ నినాదంతో ఉండే బలమేంటనేది కేంద్రానికి రుచి చూపించాలన్నారు.
హిందూత్వం కార్డు అడ్డు పెట్టుకుని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పెద్దలు..అదే కార్డుతో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray)ఆరోపించారు. భవిష్యత్‌లో శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిగా చేస్తానన్నారు. చాలా ఏళ్లుగా శివసేన-బీజేపీ (Shivsena-Bjp)కలిసి వివిధ ఎన్నికల్లో పోటీ చేయడం, కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు లేని అవినీతి ఇప్పుడు ఎలా ఒక్కసారిగా వచ్చేసిందని నిలదీశారు. మీ పల్లకీలు మోసేందుకు శివసేన పుట్టలేదని..గడ్డుకాలంలో సైతం బీజేపీకి (Bjp)అండగా నిలిచామని గుర్తు చేశారు. అప్పుడు తమ పార్టీ అవినీతి పార్టీ అని ఎందుకు అన్పించలేదని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే కొమ్ములతో పొడుస్తామని హెచ్చరించారు.
Also read: Kerala Heavy Rains: కేరళలో భారీ వర్షాలు, కొట్టుకుపోతున్న ఇళ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి