Kerala Heavy Rains: కేరళలో భారీ వర్షాలు, కొట్టుకుపోతున్న ఇళ్లు

Kerala Heavy Rains: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లు సరస్సులుగా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. జలప్రళయం విరుచుకుపడుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2021, 10:03 AM IST
  • అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళను ముంచెత్తుతున్న వర్షాలు
  • భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, నదులు
  • భారీ వర్షాలతో విరిగిపడిన కొండ చరియలు, ఏడుగురి మృతి
Kerala Heavy Rains: కేరళలో భారీ వర్షాలు, కొట్టుకుపోతున్న ఇళ్లు

Kerala Heavy Rains: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లు సరస్సులుగా మారిపోయాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. జలప్రళయం విరుచుకుపడుతోంది.

అరేబియా సముద్రంలో(Arabian Sea)ఏర్పడిన అల్పపీడనం (Low Depression)కారణంగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains in Kerala)ముంచెత్తుతున్నాయి. ఫలితంగా వరద నీరు పోటెత్తింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో ఊర్లన్నీ సరస్సులుగా మారిపోయాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి.

వరదలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచి..ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించిపోయింది. ఇప్పటి వరకూ ఏడుగురు మరణించినట్టు తెలుస్తోంది. 2018లో వచ్చిన వరద విలయాన్ని మర్చిపోకముందే..కేరళపై (Kerala Floods)మరోసారి వరుణుడు పగబట్టాడు. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. పలువురు గల్లంతయ్యారు. కొట్టాయంలో ఐదు ఇళ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు, వరద నేపధ్యంలో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి.

వాస్తవానికి కేరళలో రేపట్నించి కళాశాలలు తెరవాలని అనుకున్నారు కానీ అనూహ్యంగా వర్షాలు విరుచుకుపడటంతో వాయిదా పడింది. అక్టోబర్ 20 తరువాతే కళాశాలల్ని తెరుస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)తెలిపారు. వర్షాల నేపధ్యలో శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులెవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.

 

అక్టోబర్ 19 వరకూ శబరిమల పర్యటన(Sabarimala Tour)వాయిదా వేసుకోవాలని సూచించారు.

Also read: AP Power Crisis: ఏపీలో విద్యుత్ సంక్షోభం ఉందా లేదా, విద్యుత్ శాఖ ఏం చెబుతోంది, ఏది వాస్తవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News