Dress Code For Govt Employees: ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Government ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే కొంతమంది వస్త్రధారణ సరైన పద్దతిలో ఉండటంలేదని, అలాంటి వారివల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోందని మహారాష్ట్ర సర్కార్ 8న విడుదల చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మహారాష్ట్ర  ఉద్యోగులు సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయల్లో టీ-షర్టులు, జీన్స్ ( T-Shirt, Jeans ) ధరించడం నిషేధం విధించింది. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగుల వస్త్రధారణ సరైన పద్ధతిలో హుందాగా ఉండాలని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్‌లల్లో పనిచేస్తున్న పురుష, మహిళా ఉద్యోగులు ( employees ) తగిన ఫార్మల్ దుస్తులు ధరించి మాత్రమే విధులకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో సూచించింది. పురుషులు టీ-షర్టులు, జీన్స్ ప్యాంట్‌లకు దూరంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక మహిళా ఉద్యోగులు చీరలు, సల్వార్, చూడిదార్స్ కుర్తాస్, ట్రౌజర్ ప్యాంట్స్, షర్టులతోపాటు దుప్పట్టా లాంటివి ధరించి ఆఫీస్‌లకు రావొచ్చని పేర్కొంది. దీంతోపాటు వేసుకునే చెప్పులు, బూట్లు కూడా హుందాగా ఉండాలని సూచించింది. ఎంబ్రాయిడరీ లాంటి దుస్తులు వేసుకోని కార్యాలయాలకు రావొద్దని సూచించింది. చేనేతను ప్రోత్సహించేందుకు వారంలో ఓ రోజు ఖాదీ దుస్తులు ధరించి కార్యాలయాలకు హాజరుకావాలని సర్క్యూలర్‌లో పేర్కొంది. Also read: New Rules 2021: కొత్త చట్టాలతో 2021 నుంచి మీ జీతంపై ప్రభావం


ఇదిలాఉంటే.. గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించవద్దంటూ ఇదే తరహాలో ఆదేశాలు వెలువడ్డాయి. కొన్నిచోట్ల మహిళలు స్కర్టులు ధరించవద్దంటూ కూడా ఆదేశాలు వచ్చాయి. 


Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook