Maharashtra: కరోనా మహమ్మారి మహారాష్ట్రపై మరోసారి దాడికి సిద్ధమైంది. కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటు కరోనా కేసులు, అటు ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కోవిడ్ 19 సంక్రమణ, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్రలో లాక్‌డౌన్ పరిస్థితి సమీపంలోనే ఉందని ఆ రాష్ట్ర మంత్రి చెప్పడమే దీనికి నిదర్శనం. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నిన్న ఒక్కరోజులో భారీగా పెరిగాయి. ఒక్కరోజే 8 వేల 67 వేల కేసులు బయటపడ్డాయి. మొన్నటితో పోలిస్తే..2 వేల 699 కేసులు అధికం. అందుకే దేశవ్యాప్తంగా కరోనా కేసులు కూడా ఒక్కసారిగా 22 వేలకు పెరిగాయి.


రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే పరిస్థితి సమీపిస్తోందని..అయితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) తుది నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. అదే సమయంలో ప్రయాణాలపై ఆంక్షల్ని కూడా విధించనున్నామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్ పెరిగితే లాక్‌డౌన్ విధిస్తామని మరో మంత్రి చెప్పారు. మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 24 వేల 509 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా ఉన్నాయి. రాష్ట్రంలో 454 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. జనవరి మూడవ వారం నాటికి రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 2 లక్షలకు చేరుకోవచ్చనేది ఓ అంచనా. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలను బట్టి అదే అన్పిస్తోందని వైద్యశాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) లేదా ఒమిక్రాన్ వేవ్ తీవ్రత స్వల్పంగా ఉంటుందా లేదా అనేది చెప్పలేమని కూడా అంటున్నారు. రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లు, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, ఇతర కార్యక్రమాలపై కొత్తగా ఆంక్షలు విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. పరిస్థితి తీవ్రత పెరిగితే...రాష్ట్రంలో కచ్చితంగా లాక్‌డౌన్ విధించనున్నారని తెలుస్తోంది. 


Also read: Covid 19 Third Wave: కరోనా థర్డ్ వేవ్.. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలపై పేలుతున్న జోకులు, మీమ్స్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి