Meet Ban: దక్షిణ ఢిల్లీలో మాంస విక్రయాల నిషేధంపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాంసం కూడా ఉల్లి, వెల్లుల్లి లాంటిదేనన్నారు. మాంసమనేది అపవిత్రం కాదని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరలో మాంసం దుకాణాల మూసివేతకు అధికారిక ఉత్తర్వులు ఇస్తామని..నవరాత్రి 9 రోజులు అనుమతించమని దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ మేయర్ ముఖేష్ సూర్యన్ చేసిన ప్రకటన సంచలం రేపింది. నవరాత్రి సందర్భంగా ఆ 9 రోజులు మాంసం విక్రయాలపై నిషేధించనున్నారు. ఢిల్లీలో 99 శాతం కుటుంబాలు నవరాత్రుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయల్ని కూడా తినరని మేయర్ ముఖేష్ సూర్యన్ గుర్తు చేశారు. ఈ మేరకు ఎస్డీఎంసీ కమీషనర్ జ్ఞానేష్ భారతికి ముఖేష్ సూర్యన్ ఓ లేఖ రాశారు. 


నవరాత్రి పురస్కరించుకుని ప్రతిరోజూ దుర్గామాత పూజలు చేసే భక్తులు..మాంసం దుకాణాలు దాటుకుని వెళ్లాలన్నా..ఆ వాసన భరించాలన్నా ఇబ్బందిగా ఉంటుందట. ఇది భక్తుల మతపరమైన నమ్మకాల్ని దెబ్బతీస్తాయని లేఖలో వెల్లడించారు. దుర్గామాత భక్తులు 9 రోజులపాటు కఠినమైన శాఖాహార ఆహారంతో పాటు మాంసాహార పదార్ధాలు, మద్యం, కొన్ని సుగంధ ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉంటాని వివరించారు. 


దీనిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ మండిపడ్డారు. నవరాత్రి సందర్భంగా మాంసం విక్రయాల్ని నిషేధించడాన్ని ఖండించారు. మాంసం అపవిత్రం కానే కాదని..ఉల్లి, వెల్లుల్లి లాంటిదేనన్నారు. ఇది కేవలం ఆహారం మాత్రమేనన్నారు. మాంసం కొనుగోలు చేయాలా వద్దా అనేది ప్రజలు ఇష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. మరోవైపు ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడ్డారు. బడా పారిశ్రామిక వేత్తల వ్యాపారాల్ని సులభతరం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పారిశ్రామికవేత్తలకే పరిమితం చేయాలనేది మోదీ ఆలోచన అని చెప్పారు. మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తే..మాంసం వ్యాపారులు కోల్పోయే ఆదాయాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. 


Also read: YouTube Channels: పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం, బ్లాక్ చేసిన జాబితాలో ఇండియా ఛానెళ్లు కూడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook