Nandigram Election: నందిగ్రామ్ ఎన్నికలపై మమతా బెనర్జీ పిటీషన్ విచారణ ఆగస్టు 12వ తేదీన
Nandigram Election: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నిక వ్యవహారం మరోసారి వార్తల్లోకొచ్చింది. నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ వేసిన పిటీషన్ కోల్‌కత్తా హైకోర్టులో త్వరలో విచారణ జరగనుంది. నందిగ్రామ్ వ్యవహారాన్ని మమతా బెనర్జీ సీరియస్‌గా తీసుకున్నారు.
Nandigram Election: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నిక వ్యవహారం మరోసారి వార్తల్లోకొచ్చింది. నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ వేసిన పిటీషన్ కోల్‌కత్తా హైకోర్టులో త్వరలో విచారణ జరగనుంది. నందిగ్రామ్ వ్యవహారాన్ని మమతా బెనర్జీ సీరియస్‌గా తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో(West Bengal Elections) ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో మాత్రం సువేందు అదికారి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. నందిగ్రామ్ ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ..ఆ ఎన్నికల్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌ను కోల్‌కత్తా హైకోర్టు (Kolkatta High court) స్వీకరించింది. ఆగస్టు 12వ తేదీన పిటీషన్‌పై విచారిస్తామని చెప్పిన హైకోర్టు..ప్రతిపక్ష నేత సువేందు అధికారికి నోటీసులు జారీ చేయనుంది. నందిగ్రామ్ ఓట్లకు సంబంధించిన అన్ని రికార్డుల్ని భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి సూచించింది. మరోవైపు మమతా బెనర్జీ పిటీషన్‌ను రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ బీజేపీ నేత, నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారి(Suvendu Adhikari) సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్‌లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంపై జూలై 15న అంటే ఇవాళ కేంద్ర ఎన్నికల కమీషన్‌ను టీఎంసీ కలవనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నందిగ్రామ్‌లో ఓడిపోవడంతో ఏదో ఒక స్థానం నుంచి ఆరు నెలల్లోగా మమతా బెనర్జీ(Mamata Banerjee) ఎమ్మెల్యేగా ఎన్నిక కావల్సి ఉంది.
Also read: Punjab Congress Issue: పంజాబ్ పీసీసీ పగ్గాలు నవజ్యోత్ సింగ్ సిద్దూకేనా, త్వరలో అధికారిక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook