Sacrilege attempt at Golden Temple: పంజాబ్ అమృత్‌సర్‌లోని (Amritsar) సిక్కుల పవిత్ర ఆలయం గోల్డెన్ టెంపుల్‌లో శనివారం (డిసెంబర్ 19) జరిగిన అనూహ్య ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి గర్భ గుడిలోకి దూకి వీరంగం సృష్టించాడు. సిక్కుల పవిత్ర గ్రంధం గురుగ్రంద్ సాహిబ్ (Guru Grandh Sahib) ముందు ఉంచిన ఖడ్గాన్ని చేతపట్టి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురిచేశాడు. సాయంత్రం ప్రార్థనల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే ఆ వ్యక్తిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC)కి అప్పగించారు. అక్కడి నుంచి అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో... ఆగ్రహంతో ఊగిపోయిన భక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా ఆ గుంపు మొత్తం అతనిపై దాడి చేయడంతో... ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ పీఎస్ భందాల్ మాట్లాడుతూ... ఆ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు. స్వర్ణ దేవాలయంలో (Amritsar Golden Temple) సాయంత్రం ప్రార్థనల సమయంలో గర్భ గుడి చుట్టూ ఉన్న గ్రిల్ పైనుంచి అతను లోపలికి దూకాడని తెలిపారు. గురుగ్రంద్ సాహిబ్ గ్రంధం వద్ద ఉంచిన ఖడ్గాన్ని అతను చేతపట్టాడని... ఈ అపవిత్ర కార్యానికి అక్కుడున్న భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయాడన్నారు.


గర్భగుడి గ్రిల్ పైనుంచి అతను లోపలికి దూకి వీరంగం సృష్టించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఈ ఘటనపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) విచారం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ వైఫల్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు... నిందితుల వెనుక ఉన్న శక్తులను పట్టుకోవడంలో విఫలమయ్యారని... వారిని మానసిక వ్యాధిగ్రస్తులుగా పేర్కొని విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ ఘటనను ఖండించారు. ఘటనపై సమగ్ర విచారణకు పోలీస్ శాఖను ఆదేశించారు. ఎస్‌జీపీసీ అధ్యక్షుడితో మాట్లాడిన సీఎం... ఈ ఘటన వెనక ఉన్న కుట్రదారులను బయటపెడుతామని హామీ ఇచ్చారు.



 


Also Read: Kidambi Srikanth: సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రీకాంత్‌.. సైనా, సింధు తర్వాత!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook