marriage ceremony at Covid Centre: #WATCH: న్యూఢిల్లీ: వారం నుంచి వారి ఇంట పెళ్లి హడావుడి నెలకొంది. మరికొన్ని గంటల్లో వివాహ తంతు కూడా ముగిసేది. సరిగ్గా పెళ్లి రోజునే వధువుకు కరోనా ( Coronavirus ) పాజిటివ్‌గా తేలింది. అందరూ ఆ కొత్త జంటకు ఇప్పుడు పెళ్లి జరగదనుకున్నారు. అయినా వారి పెళ్లి కోవిడ్ (COVID19 ) సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి నూతన వధూవరులతోపాటు పురోహితుడు, పెద్దలు కూడా హాజరయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ ( Rajasthan ) రాష్ట్రంలోని షాబాద్ ( Shahbad ) జిల్లా బరాలో జరిగింది. షాబాద్ జిల్లాకు చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు ముహూర్తం కూడా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో వివాం రోజే వధువుకు కరోనా సోకిందని తేలింది. అయినప్పటికీ.. పెళ్లి తంతును ముగించాలని వధూవరుల కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. Also read: Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరుకుటుంబాల నిర్ణయం మేరకు షాబాద్ జిల్లాలోని బరా కెల్వారా కోవిడ్ సెంటర్‌ (Kelwara Covid Centre) ఈ నూతన వధూవరులకు వివాహ వేదికగా మారింది. కోవిడ్ సెంటర్‌లోనే కల్యాణ మండపాన్ని (marriage ceremony ) ఏర్పాటు చేసి.. సాంప్రదాయబద్దంగా వేదమంత్రోచ్చరణల మధ్య పెళ్లిని ఘనంగా నిర్వహించారు. అందరూ పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డు, గ్లౌజులు ధరించి వివాహ వేడుకను పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందరూ ఈ పెళ్లిని చూసి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. Also read: New Parliament Building: కొత్త సౌధానికి 10న పూనాది రాయి


 


Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook