Balram Bhargava: కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా మాస్కులు ధరించాల్సిందే
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి కట్టడి కోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలను సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్, ప్రొఫెసర్ బలరాం భార్గవ (Balram Bhargava) స్పష్టం చేశారు.
masks compulsary even after covid-19 vaccine: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి కట్టడి కోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలను సుదీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్, ప్రొఫెసర్ బలరాం భార్గవ (Balram Bhargava) స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా సరే ప్రజలు సుదీర్ఘకాలం పాటు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రపర్చుకోవడం వంటి నిబంధనలను ఇకపై కూడా కొనసాగించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కొవిడ్ వ్యాధి నిర్వహణ-మార్పులు అనే అంశంపై కోల్‌కతాలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో బలరాం భార్గవ ఈ విషయాన్ని చెప్పారు. Also read: CoviShield ఎమర్జెన్సీ వినియోగానికి దరఖాస్తు: అదర్ పూనావాలా
వ్యాక్సిన్ తయారీలో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జూలై నాటికి దేశంలోని 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాలన్నదే తమ లక్ష్యమని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రొఫెసర్ బలరాం భార్గవ వెల్లడించారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనావైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్ (covid-19 vaccine news) ఒక్కటే సరిపోదని.. ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలను ఇకపై కూడా కొనసాగించాల్సి ఉంటుందని బలరాం భార్గవ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు ప్రముఖ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిలో రెండు భారత్‌లో తయారవుతుండగా మిగతా మూడు విదేశాలకు చెందినవని ఆయన తెలిపారు.
Also read: Narendra Modi: భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe