Covid vaccine emergency use: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌లో తయారవుతున్న పలు వ్యాక్సిన్‌ల పురోగతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమీక్షించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో పర్యటించి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ల పురోగతిపై నరేంద్ర మోదీ స్వయంగా శాస్త్రవేత్తలతో మాట్లాడి అభినందించి వారిలో జోష్ నింపారు. అయితే పూణేలోని సీరం సంస్థను ప్రధాని సందర్శించిన అనంతరం ఆ సంస్థ సీఈవో పూనావాలా (Adar Poonawalla) వర్చువల్ వేదికగా పలువురు ప్రముఖులతో, మీడియాతో మాట్లాడారు. ఎమర్జెన్సీ వినియోగం కోసం తమ కరోనా టీకా కోవిషీల్డ్ (Covishield) కు అనుమతి ఇవ్వాలని కోరుతూ వచ్చే రెండు వారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు సీరం (SII) సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.
వ్యాక్సిన్ సంస్థలు ఇచ్చే కచ్చితమైన సమాచారం ఆధారంగా ఎమర్జెన్సీ వినియోగానికి లైసెన్సు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సమాచారాన్ని ఔషధ నియంత్రణ సంస్థకు అందజేసే ప్రక్రియలో ఉన్నామని పూనావాలా వివరించారు. టీకా పంపిణీ ముందుగా భారత్‌లో జరుగుతుందని, ఆ తర్వాత తమ కంపెనీ కోవ్యాక్స్ దేశాలపై, ప్రధానంగా ఆఫ్రికాపై దృష్టి సారిస్తుందని పూనావాలా చెప్పారు. తక్కువ ధరకు భారత్ నుంచి తయారయ్యే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ మనవైపు ఎదురుచూస్తున్నారని పూనావాలా పేర్కొన్నారు. Also read: Narendra Modi: భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని
కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ఇటీవల దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe