Himachal Pradesh Landslides: హిమాచల్ ప్రదేశ్ పై ప్రకృతి మరోసారి కన్నెర్ర జేసింది. కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు బీభత్సం సృష్టించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిన్నౌర్‌ జిల్లా(Kinnaur‌ District)లోని రెకాంగ్‌ పియో - సిమ్లా హైవేపై కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. కొండచరియల కింద పలు వాహనాల్లో సుమారు 40 మంది ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. 


కిన్నౌర్‌ నుంచి సిమ్లా(Shimla)కు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)  ఆర్టీసీకి చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ..సహాయకచర్యలు చేపట్టారు. తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. 


Also Read: విడిపోయిన ఐఎఎస్ టాపర్స్ జంట...టీనాదబీ, అధర్‌ ఆమిర్‌ ఖాన్‌లకు విడాకులు!


ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు(ITBP) రెస్క్కూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆపరేషన్‌ పూర్తికాగానే చెబుతామని అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.


ఘటనపై ప్రధాని మోదీ(PM Modi)  ఆరా తీశారు. హిమాచల్‌  సీఎం జైరామ్‌ ఠాకూర్‌(CM Jairam Thakur)తో ఫోన్లో మాట్లాడి.. కేంద్రం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు అమిత్ షా(Amit shah) కూడా ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలను  అడిగి  తెలుసుకున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook