గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బహ్రెయిచ్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాగ్రోస్ కెమికల్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడ్డ మంటలను ఆర్పేందుకు ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 4 అగ్ని మాపక యంత్రాలు  ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే ప్రారంభించినప్పటికీ ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు. 


[[{"fid":"184061","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పైగా కెమికల్ కాలిపోయిన కారణంగా .. ఫ్యాక్టరీ చుట్టు పక్కల దట్టంగా పొగ అల్లుకుంది. దీంతో ఆ ప్రాంతమంతా ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసన నెలకొంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటు ఫ్యాక్టరీలో మంటలకు కారణమేంటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ.. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..