Medicine Price: సామాన్యుడిపై మరో భారం.. పెరగనున్న మెడిసిన్ ధరలు
ఇప్పటికే వంట నూనెలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రెట్లు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెడిసిన్స్ రెట్లు పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరో భారం పడనుంది.
Medicine Price Going to Hike from April 1: మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు.. దేశంలో వరుసగా పెరుగుతున్న రెట్లతో సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ధరల మాట వింటే సామాన్యుడు షాక్ అవుతున్నాడు. ఇప్పటికే వంట నూనెలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రెట్లు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెడిసిన్స్ రెట్లు పెరుగుతుండటంతో కొనేదెలా అని సామాన్యుడు కలవరపడుతున్నాడు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిన అది చివరికి సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంది.
ఎక్కడో ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో భారత్‌లో ఇంధన ధరలు, వంట నూనెల రెట్లు పెరగడంతో సామాన్యుడు తీవ్ర అవస్థలు పడుతున్నాడు. ఎల్లుండి నుంచి మందుల ధరలు కూడా పెరగబోతున్నాయన్న వార్త సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కాలంలో మెడిసిన్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్క డోలో-650 టాబ్లెట్స్ మాత్రమే కోవిడ్ కాలంలో 350 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్టు అమ్మకాలు జరిగినట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి డోలో, పారాసెటమాల్‌తో సహా దాదాపు 809 రకాలకు పైగా మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి.
కరోనా విజృంభణ క్లిష్ట సమయంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ప్రజలు వెంటనే మెడికల్ షాపులకు వైపు పరుగెత్తారు. తలనొప్పి, జలుబు, జ్వరం, ఒళ్లు నోప్పులు ఇలా ఏ చిన్న సమస్య ఉన్నా అది కరోనా అని భయాందోళనకు గురై మందులు స్టాక్ పెట్టుకున్నారు. సెకండ్, థర్డ్ వేవ్ టైంలో ఇది మరింత అధికమైంది. బీపీ, దీర్ఘకాలిక, తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే దాదాపు 850 షెడ్యూల్ చేసిన మందుల ధరలు ఏప్రిల్ 1వ తేది నుంచి 10.7 శాతం రెట్లు పెరగనున్నాయి.
గత ఏడాది మెడిసిన్స్ ధరలు.. ఈ ఏడాది మెడిసిన్స్ ధరలు పోలిస్టే 10 శాతం మేర పెరిగినట్లు నేషనల్ ఫార్మా స్యూటికల్ అథారిటీ తాజాగా వెల్లడించింది. దీంతో పెయిన్ కిల్లర్లు.. యాంటీబయాటిక్స్‌తో సహా పలు అత్యవస మెడిసిన్స్ భారీగా రెట్లు పెరగనున్నాయి. దేశంలో ఇక రోజూ వారి మెడిసిన్స్ వాడే వారికి మందుల ధరల పెరుగుదల పెద్ద ఇబ్బందిగా మారనుంది. రక్తహీనత, బీపీ, గుండెజబ్బులు, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు తదితరాల చికిత్సలో వినియోగిచే మెట్రోనిడాజోల్, అజిత్రోమైసిన్, పారాసిటమాల్ వంటి మందులతో పాటు ఈ జాబితాలో ఉన్నాయి.
నాన్ షెడ్యూల్ డ్రగ్స్ ధరల వార్షిక పెరుగుదల పోలిస్తే తొలిసారిగా షెడ్యూల్ డ్రగ్స్ రెట్ల పెంపు అధికంగా ఉండనుంది. ధరల సూచీలో మార్పుల కారణంగా గత కొన్నేళ్లుగా ఈ పెరుగుదల 1-2 శాతానికే పరిమితమైంది. 2019లో ఔషధ కంపెనీలకు 2శాతం పెంపును అనుమతించింది. 2020లో కేవలం 0.5 శాతం పెంచారు. గత నెలలోనే ఉక్రెయిన్-రష్యా వార్‌తో మందుల ధరలు పెరగగా ఇప్పుడు ఇంధన ధరల ప్రభావంతో మరోసారి పెరగనున్నాయి.
కొవిడ్ తర్వాత ప్యాకింగ్, రవాణా, ముడిపదార్థాలు, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో మెడిసిన్స్ రెట్లు పెంచాలని ఫార్మా కంపెనీలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మెడిసిన్స్ రెట్ల పెంపుతో ఫార్మా కంపెనీలకు ఊరట కలగనుంది. ఇంధన ధరలు, నిత్యావసర రెట్లు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంట నూనెలు, ఇంధన, గ్యాస్ ధరలు..తాజాగా మరోవైపు మెడిసిన్స్ ధరలు పెరుగుతుండడంతో జనరిక్ మెడికల్ షాపుల సంఖ్య పెంచి సాధారణ మందులపై ధరలు పెంచవద్దని కోరుతున్నారు సామాన్య, మధ్య తరగతి ప్రజలు.
Also read: New EPF Rules: ఏప్రిల్ నుంచి మారనున్న పీఎఫ్ రూల్స్.. పూర్తి వివరాలు ఇవే..
Also read: Unemployment Rate In India: దేశంలో నిరుద్యోగ రేటు ఎంత? ఏ రాష్ట్రంలో అత్యధికం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook