భారత్ నుంచి పరారైన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు గత రెండేళ్లుగా ఆంటిగ్వా, బార్బుడాలో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి అక్కడి నుంచి డొమినికాకు చేరుకున్నాడు. ఆయనపై ఎల్లో నోటీస్ జారీ కావడంతో మెహుల్ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెహుల్ చోక్సీ కటకటాల వెనుక ఉన్న ఫొటోలో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. చోక్సీపై పోలీసులు దురుసులు ప్రవర్తించారని, ఆయనపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారంటూ వజ్రాల వ్యాపారి తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఆరోపించారు. డొమినికా జైలులో మెహుల్ చోక్సీ (Mehul Choksi Arrest) ఫొటోలను గమనిస్తే ఆయన కళ్లు ఎర్రబడ్డాయి. చేతిపై గాయాలున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు చోక్సీ అరెస్ట్‌పై డొమినికా కోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ బుధవారం నాడు విచారణకు రానుంది. విచారణ పూర్తయితేగానీ భారత వజ్రాల వ్యాపారి అరెస్ట్ చట్టబద్ధమైనదో కాదో బహిర్గతం కానుంది.


Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


62 ఏళ్ల వ్యాపారవేత్త మెహుల్ చోక్సీకి పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన రూ.13,500 కోట్ల కుంభకోణం (PNB Scam)తో సంబంధం ఉందని తెలిసిందే. ఈ కుంభకోణం వివరాలు బయటకు రావడంతో చోక్సీ ఆంటిగ్వాకు పరారయ్యాడు. 2018 నుంచి ఆంటిగ్వా, బార్బుడాలో తలదాచుకుంటున్నాడు. మరోవైపు 2017లోనే ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకోవడం గమనార్హం. భారత్‌లో వజ్రాల వ్యాపారి చేసిన నేరాలకు సంబంధించిన రుజువులు, పత్రాలను ఓ ప్రత్యేక విమానంలో భారత ప్రభుత్వం డొమినికాకు పంపించింది. అతడ్ని తమకు అప్పగించాలని డొమినికా ప్రభుత్వాన్ని కోరారు.


Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook