Love jihad: మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకనుగుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా లవ్ జీహాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ రంగ ప్రవేశానికి ముందే ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ ( Kerala )రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ( Kerala assemby elections ) 2-3 నెలల్లో జరగాల్సి ఉండగా..మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ ( Metro man of india sridharan )బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 21వ తేదీన బీజేపీ తలపెట్టిన విజయ యాత్ర కార్యక్రమంలో భాగంగా కాషాయ కండువా కప్పుకోనున్నారు. అప్పుడే తనను తాను అందుకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కూడా. రాజకీయ రంగ ప్రవేశానికి ముందే ప్రభుత్వం, వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలు ప్రారంభించారు. తాజాగా లవ్ జిహాద్‌పై వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు.


లవ్ జిహాద్( Love jihad ) కారణంగా ఎంతోమంది అమాయక యువతులు బలైపోతున్నారని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ తెలిపారు. కేరళలో ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని..ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిదని ధ్వజమెత్తారు. కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్( Love jihad ) పరిణామాల్ని చూస్తున్నానని..హిందూవుల్ని ఏ విధంగా బలవంతపు పెళ్లిళ్లతో బందిస్తున్నారో తెలుసని..తరువాత ఎలాంటి బాధలు పడుతున్నారనేది గమనిస్తున్నానని చెప్పారు శ్రీధరన్. కేవలం హిందూవులు మాత్రమే కాదు..ముస్లింలు, క్రిస్టియన్లు సైతం అదే ఊబిలో చిక్కుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌( Kerala cm pinarayi vijayan )ను ఓ నియంతగా అభివర్ణించారు. ఈ ముఖ్యమంత్రి పాలనకు పదికి 3 మార్కులు కూడా రావన్నారు. ఆయనసలు ప్రజలతో మమేకమే కారని..ప్రజల్లో ఆయన పట్ల సదభిప్రాయం లేదని చెప్పారు. రాష్ట్రంలోని మంత్రులకు కూడా స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి లేదని..అభిప్రాయాలు పంచుకుననే స్వాతంత్ర్యం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ( BJP )తరపున పోటీ చేస్తానని..పార్టీ అధికారంలో వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దమని..మనసులో మాట బయటపెట్టేశారు. 


Also read: Corona new strain: మహారాష్ట్రలో కొత్త రకం కరోనా వైరస్, రంగంలో దిగిన మార్షల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook