Modi 3.0 Oath ceremony: నరేంద్రుడి మంత్రి వర్గంలో ఆ రాష్ట్రానికి పెద్ద పీట.. కారణం అదేనా..?..
Modi cabinet 2024: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Pm modi 3.0 Oath ceremony update: ప్రధాని మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మిత్ర పక్ష పార్టీలతో కలిసి మోదీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఎగ్జీట్ పోల్స్ కు అంచనాలకు దిమ్మతిరిగేవిధంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చారు. మోదీ అప్ కీ బార్ చార్ సో పార్ అన్న నినాదంలో ఎన్నికలలో వెళ్లారు. బీజేపీ నేతలంతా మోదీ మేనియాతో మంచి మెజార్టీ సాధిస్తుందని భావించారు . కానీ ప్రజలు మాత్రం అనూహ్యాంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునే సీట్లను కూడా ప్రజలు బీజేపీకి ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. మోదీ తన మిత్ర పక్ష పార్టీలతో కలిసి మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
మెయిన్ గా చంద్రబాబు, బీహర్ నితీష్ కుమార్ ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా.. మరికాసేపట్లో.. మోదీ (ఆదివారం) సాయంత్రం 7.15 నిముషాలకు ప్రధానీగా ప్రమాణ స్వీరానికి ముహుర్తం కుదిరింది. ఇదిలా ఉండగా.. మోదీ క్యాబినేట్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు కేటాయిస్తారో అనేదానిపై పెద్ద చర్చ నెలకొంది. ఈనేపథ్యంలో బీజేపీ యూపీలో రామజన్మభూమి.. , అయోధ్య భవ్య రామమందిరంను నిర్మించిన కూడా యూపీ ప్రజలు బీజేపీని చిత్తుగా ఓడించారు. దీంతో బీజేపీ అధినాయకత్వం చేసిన పొరపాట్లను తెలుసుకుని, ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకతను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో మోదీతో పాటు అనేక రాష్ట్రాలలో ఎంత మంది మంత్రులను కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందా. ఉత్తర ప్రదేశ్ కు మోదీ మంత్రి వర్గంలో మోస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ కు 6 గురిని మంత్రులుగా, బీహర్, మహరాష్ట్రాల నుంచి 5 గురు చొప్పున మంత్రి వర్గంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. మధ్య ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ల ఇద్దరు చొప్పున మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇక కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని మంత్రి వర్గంలో బెర్త్ లు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.
Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
జేడీయూ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి 37, మొత్తంగా ఈసారి కొత్తగా 7 గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ నుంచి ఇద్దరిని, ఏపీ నుంచి ముగ్గురిని మంత్రులుగా స్థానం కల్పించారు. మొత్తంగా చూస్తే ఈరోజు దాదాపుగా.. ప్రధాని మోదీతో పాటు.. 60 నుంచి 65 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter