Kerala CM Pinarayi Vijayan Comments On CAA Bill: దేశంలో ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం హట్ టాపిక్ గా మారింది. నాలుగేళ్ల క్రితమే మోదీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందింది. కేంద్రం తాజాగా దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా.. 2019 లో తెచ్చిన పౌరసత్వ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల.. బంగ్లాదేశ్, పాక్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి డిసెంబర్ 31,2014  లేదా అంతకంటే ముందు భారత్ కు వచ్చిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం అందించేందుకు ఈ చట్టం ను రూపొందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: CAA Protest: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల అభ్యంతరం, ఎంఐఎం నేత అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు


గత పద్నాలుగు ఏళ్లలో భారత్ లో కనీసం ఐదేళ్లు ఉంటే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. కానీ గతంలో ఇది పదకోండు సంవత్సరాలు ఉండేలా నిబంధన ఉండేది. డిసెంబర్ 2019 న సీఏఏ ను పార్లమెంట్ ఆమోదించింది. దీన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించారు. దీనిపై అప్పట్లో తీవ్ర రచ్చ జరిగింది. దీన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదిస్తుండగా.. కొన్నిరాష్ట్రాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం వల్ల ముస్లింలు తీవ్రంగా నష్టపోతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఈ చట్టన్ని పక్కన పెట్టి, కేవలం ఎన్నికల ముందు దీన్ని తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


ఏది ఏమైన తమ రాష్ట్రంలో మాత్రం సీఏఏను అమలు చేయమంటూ సీఎం పినరయి విజయన్ తెల్చిచెప్పారు. సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్ల అంశాన్ని డైవర్ట్ చేయడానికి మోదీ హడావిడిగా దీన్ని తీసుకొచ్చారని పాలు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఈ చట్టం వల్ల దేశంలోని ముస్లింలు మైనారరిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తాము పలుమార్లు దీనిపై క్లారిటీ ఇచ్చామని చెప్పారు.


Read More: Matric Exam Paper Viral: ప్లీజ్ సార్ .. నన్ను పాస్ చేయండి.. లేకుంటే పెళ్లి చేస్తారు.. వైరల్ గా మారిన యువతి ఎగ్జామ్ పేపర్..


ఈ నేపథ్యంలో పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలంతా ఏకతాటిపై రావాలని కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపు నిచ్చారు. ఇక ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ , సమాజ్ వాది పార్టీ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం దీన్ని వ్యతిరేకించింది. ప్రస్తుతం సీఏఏ చట్టం దేశ వ్యప్తంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook