Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
Free Ration Scheme: కరోనా సంక్షోభంలో ప్రవేశపెట్టిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్టున్నట్టు ప్రకటించింది. దీనికి అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Free Ration Scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభంలో ఉచిత రేషన్ పథకాన్ని ప్రకటించిన మోదీ సర్కారు.. మరికొన్ని నెలలు దాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేఏవై) గడువును పొడిగిస్టున్నట్టు ప్రకటించింది. దీనికి అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
తాజా పొడిగింపుతో ఈ పథకం 2022 మార్చి వరకు అమలు కానుంది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ పంపిణీ జరుగుతుంది. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తుంది.
దేశంలో గతేడాది ఏప్రిల్ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటున్న తరుణంలో నవంబర్ 30 తర్వాత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించే ప్రతిపాదన ఇంతవరకు లేదని నవంబర్ 5న కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవల వెల్లడించారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ పథకాన్ని మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook