Union minister Suresh Angadi death: కరోనాతో కన్నుమూసిన కేంద్ర మంత్రి
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి (65) ఇక లేరు ( Suresh Angadi passes away ). కరోనావైరస్ సోకడంతో కొవిడ్-19 చికిత్స కోసం వారం రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి (65) ఇక లేరు ( Suresh Angadi passes away ). కరోనావైరస్ సోకడంతో కొవిడ్-19 చికిత్స కోసం వారం రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. కర్ణాటకలోని బెలగావి జిల్లా బెల్గాం తాలుకాలోని కేకే కొప్పాలో సోమవ్వ, చనబసప్ప దంపతులకు జన్మించిన సురేష్ అంగడి.. రాజకీయాల్లో అంచలంచలుగా ఎదగుతూ వచ్చారు. ప్రస్తుతం బెలగావి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్ అంగడి.. 2004 నుంచి నాలుగు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. సురేష్ అంగడి మృతి ( Suresh Angadi death ) పట్ల రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. Also read : Suresh Angadi: రైల్వే సహాయ మంత్రికి కరోనా
కేంద్ర సహాయ మంత్రి సురేష్ అంగడి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కర్ణాటకలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేసిన గొప్ప కార్యకర్తగా, అంకిత భావం కలిగిన ఎంపీగా, గొప్ప సామర్థ్యం కలిగిన మంత్రిగా సురేష్ అంగడి పనిచేశారని ఆయన సేవలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సురేష్ అంగడి మృతి తనను తీవ్రంగా కలచి వేస్తోందని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. సురేష్ అంగడి కుటుంబసభ్యులు, ఆయన సన్నిహితులకు తన సంతాపం ప్రకటించారు. Also read : India Covid-19: 55లక్షలు దాటిన కేసులు.. రికవరీల్లో రికార్డ్