Suresh Angadi: రైల్వే సహాయ మంత్రికి కరోనా

దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు, పలు పార్టీలకు చెందిన కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సర్క్యూలర్ జారీ చేయడంతో ఎంపీలంతా టెస్టులు చేయించుకుంటున్నారు.

Last Updated : Sep 11, 2020, 06:28 PM IST
Suresh Angadi: రైల్వే సహాయ మంత్రికి కరోనా

Suresh Angadi tested COVID-19 positive: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు, పలు పార్టీలకు చెందిన కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు (Parliament
monsoon session)
ప్రారంభమయ్యే మూడు రోజుల ముందు ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సర్క్యూలర్ జారీ చేయడంతో ఎంపీలంతా టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర రైల్వే  సహాయ మంత్రి సురేష్ అంగడి (Suresh Angadi) కి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే.. తాను కరోనా టెస్టు చేయించుకోగా.. రిపోర్టు పాజిటివ్‌గా వచ్చినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, ఆరోగ్యం బాగానే ఉందని.. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతానని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా..  తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. Also read:
Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

ఇదిలాఉంటే.. ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెలవులు లేకుండా నిరంతరాయంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని.. రిపోర్టు నెగిటివ్ వచ్చిన సభ్యులు మాత్రమే సమావేశాలకు హాజరు కావాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. దీంతో పార్లమెంట్ సభ్యులంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. Also read: Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

Trending News