PM Kisan Kalyan Yojana: రాష్ట్ర రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ గుడ్‌న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఖాతాల్లోకి ఇక నుంచి రూ.10 వేలకు బదులు.. 12 వేల రూపాయలు జమ చేయనుంది. రాజ్‌గఢ్ జిల్లాలో నిర్వహించిన కిసాన్-కళ్యాణ్ మహాకుంభ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద రాష్ట్ర రైతులకు ఏటా రూ.6 వేలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు అందజేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే రూ.6 వేలతో కలిపి రూ.12 వేలకు చేరనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో యూపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద రాష్ట్రంలో రైతులకు రూ.4 వేలు అందజేసింది. సీఎం శివరాజ్ సింగ్ ప్రకటన తరువాత మరో రూ.2 వేలు పెరిగి.. రూ.6 వేలకు చేరనుంది. దీంతో యూపీలోని రైతులు రూ.12 వేలు అందుకోనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చౌహాన్ ఒక్క క్లిక్‌తో ముఖ్యమంత్రి రైతు వడ్డీ మాఫీ పథకం-2023లో 11 లక్షల మంది రైతుల ఖాతాలో 2 వేల 123 కోట్లు జమ చేశారు. అదేవిధంగా 44 లక్షల 49 లబ్ధిదారుల ఖాతాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా 2 వేల 900 కోట్లు, ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద రూ.70 లక్షల 61 వేలు బదిలీ చేశారు. ఒకే రోజు మొత్తం రూ.6 వేల 423 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. 


Also Read: Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అన్నదాతలపై మోపిన వడ్డీ భారాన్ని తమ ప్రభుత్వం తొలగిస్తోందన్నారు. రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం పెరగడంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. గతంలో 7.5 లక్షల హెక్టార్ల సాగునీటి సామర్థ్యం ఉన్న రాష్ట్ర సాగునీటి సామర్థ్యం.. ప్రస్తుతం 45 లక్షల హెక్టార్లకు పెరిగిందని తెలిపారు. 65 లక్షల వరకు తీసుకువెళ్లేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 


గతంలో రాష్ట్రంలో గంటల తరబడి విద్యుత్‌ కోతలు ఉండేవన్నారు సీఎం శివరాజ్. ఇప్పుడు విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించిందన్నారు. గత ప్రభుత్వం సాగునీరు, రోడ్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. రైతులను నిండా మోసం చేశారని.. సుఖలియా ప్రాజెక్టు వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.  


Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి