Good news: ఆ రాష్ట్ర మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంవత్సరానికి 7 అదనపు సెలవులు..!
Madhya pradesh: రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి అదనంగా ఏడు సాధారణ సెలవులు మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Madhya pradesh Govt: రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంవత్సరానికి అదనంగా ఏడు సాధారణ సెలవులు ఇస్తూ రాష్ట్ర పరిపాలనా శాఖాధికారి గిరిశ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక నుంచి మహిళా ఉద్యోగులకు ఏడాదికి 20 క్యాజువల్ లీవ్స్ రానున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
1964 నుంచి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 13 క్యాజువల్ లీవ్స్ ఉండేవి. ఇంటర్నేషనల్ వుమెన్స్ డే సందర్భంగా మహిళా ఉద్యోగులందరికీ 7 సాధారణ సెలవులు అదనంగా ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మహిళలకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు ఉంటాయని.. అందుకే ఈ సెలవులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారు తమ అవసరాన్ని బట్టి ఈ సెలవులు ఉపయోగించుకోవచ్చు.
2023 చివరిలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను ఆకట్టుకునేందుకు అధికార బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే సీఎం శివరాజ్ సింగ్ ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాల భర్తీలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వారికి ఆరోగ్య బీమా పథకం, కారుణ్య నియామకాలు కూడా వర్తింపచేస్తామన్నారు. ఇటీవల యూపీ ప్రభుత్వం కూడా మహిళ ఉద్యోగుల డ్యూటీ వేళల్లో మార్పులు చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయ వద్దని ఆదేశించింది.
Also Read: Nitin Gadkari About Petrol Prices: లీటర్ పెట్రోల్ ధర రూ. 15 కి దిగొస్తుంది... కానీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook