Hanuman Chalisa Row: మాజీ నటి, లోక్‌సభ సభ్యురాలు నవనీత్ కౌర్‌పై రెండవసారి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే అరెస్టైన నవనీత్ కౌర్, ఆమె భర్త రాణాపై నమోదైన మరో కేసు ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం ఎంపీ నవనీత్ కౌర్‌పై మరో ఎఫ్‌ఐఆర్ దాఖలుకు కారణమైంది. రెండు వర్గాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణలపై ఇప్పటికే నవనీత్ కౌర్ ఆమె భర్త రాణాలు అరెస్టయ్యారు. ఇప్పుడు మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని బెదిరించడం ద్వారా రెండు వర్గాల మద్య విద్వేషాగ్ని రగిల్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు నమోదయ్యాయి.


ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం ఈ కేసు నమోదైంది. ఓ పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకం కల్గించడం, నేరపూరితంగా వ్యవహరించడం, దూషించడం ఈ సెక్షన్ పరిధిలో వస్తాయి. నవనీత్ కౌర్, ఆమె భర్త రాణాలను ఇవాళ బాంద్రా కోర్టులో హాజరుపరిచారు.ఈ ఇద్దరిని రిమాండ్‌కు అప్పగించాల్సిందిగా ముంబై పోలీసులు కోరారు. కోర్టుకు హాజరైన సందర్భంగా నవనీత్ కౌర్ భర్త రవి రాణా..ఉద్ధవ్ థాకరే ముర్దాబాద్ అంటూ నినాదాలిచ్చారు. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా  విద్వేషాలు రెచ్చగొట్టి..శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రయత్నించడం, తద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు తీసుకురావాలనే కుట్ర దాగుందని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. 


రెండు వర్గాల మధ్య  మతపరంగా, జాతిపరంగా, పుట్టుక, నివాసం, భాషాపరంగా, శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వ్యవహరించినందుకు ఐపీసీ సెక్షన్ 353 ఏ ప్రకారం నవనీత్ కౌర్, రవి రాణాలపై కేసు నమోదైంది. పోలీసుల నిషేదాజ్ఞల్ని నిషేధించినందుకు సెక్షన్ 135 కూడా నమోదైంది. నిందితులు రాణా దంపతుల్ని ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ తరువాత శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా..శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్ ఇంటిని చుట్టుముట్టారు. బారికేడ్లు ధ్వంసం చేసి ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు.


Also read; Fourth Wave Alert: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.