Gangrape in lock-up: లాకప్‌లో గ్యాంగ్‌రేప్.. యువతి ఆరోపణలను ఖండించిన పోలీసులు
ఎక్కడైనా గ్యాంగ్‌రేప్ ( Gangrape ) జరిగిందని ఫిర్యాదు వస్తే.. పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసుకుని, ఘటనపై దర్యాప్తు జరిపి ఆ నేరానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలిస్తారు. కానీ పోలీసుల ఆధీనంలో ఉండే లాకప్‌లోనే సామూహిక అత్యాచారం ( Gangrape in lock-up ) జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తితే అప్పుడు పరిస్థితి ఏంటి ? ఆ నేరానికి పాల్పడింది ఇంకెవరో కాదు.. స్వయంగా పోలీసులే ( Gangrape by cops ) అని ఫిర్యాదు నమోదైతే ఆ కేసు ఇంకెంత సంచలనం సృష్టిస్తుంది.
రెవా: ఎక్కడైనా గ్యాంగ్‌రేప్ ( Gangrape ) జరిగిందని ఫిర్యాదు వస్తే.. పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసుకుని, ఘటనపై దర్యాప్తు జరిపి ఆ నేరానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలిస్తారు. కానీ పోలీసుల ఆధీనంలో ఉండే లాకప్‌లోనే సామూహిక అత్యాచారం ( Gangrape in lock-up ) జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తితే అప్పుడు పరిస్థితి ఏంటి ? ఆ నేరానికి పాల్పడింది ఇంకెవరో కాదు.. స్వయంగా పోలీసులే ( Gangrape by cops ) అని ఫిర్యాదు నమోదైతే ఆ కేసు ఇంకెంత సంచలనం సృష్టిస్తుంది. అవును మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు అలాంటి కేసే ఒకటి ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రెవా జిల్లా మంగావన్ లాకప్‌లో ( Mangawan gangrape case ) మే 9వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు 10 రోజుల పాటు ఐదుగురు పోలీసులు తనపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడినట్టు 20 ఏళ్ల యువతి జిల్లా అదనపు జడ్జికి ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 10న ఈ విషయం వెలుగుచూసినట్టు తెలుస్తోంది. జిల్లా అదనపు జడ్జి, న్యాయవాదుల బృందం జైలుని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఆ యువతి జిల్లా జడ్జికి ఆరోపణలు చేస్తూ ఈ ఫిర్యాదు చేసింది. Also read : Atchannaidu: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు.. ఈసారి బాలకృష్ణకు ప్రమోషన్
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. ఓ మర్డర్ కేసులో నిందితురాలిగా ఉన్న యువతి చేసిన ఈ ఫిర్యాదును స్వీకరించిన జిల్లా అదనపు జడ్జి.. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఈ అరాచకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు ఆమెను లెక్కచేయలేదని సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలావుంటే, లాకప్‌లో గ్యాంగ్‌రేప్ ( Lock-up gangrape allegations ) ఆరోపణలను పోలీసులు తీవ్రంగా ఖండించారు. మే 21నే యువతిని అరెస్ట్ చేస్తే.. అంతకంటే ముందు నుంచే ఆమెపై లాకప్‌లో అత్యాచారం ఎలా జరుగుతుందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై యువతి చేస్తోన్న ఆరోపణలకు, పోలీసులు చెబుతున్న సమాధానాలకు పొంతన లేకుండా ఉంది. హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న యువతి చేసిన ఈ ఫిర్యాదుపై విచారణలో చివరకు ఏం తేలనుందో వేచిచూడాల్సిందే మరి. Also read : UGC NET 2020 Exam Dates: యూజీసీ నెట్ 2020 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe