MS Swaminathan Death: దేశంలో వ్యవసాయం పేరు చెప్పగానే ముందుగా విన్పించే పేరు ఎంఎస్ స్వామినాథన్, హరిత విప్లవ పితామహుడిగా పిల్చుకునే స్వామినాథన్ వ్యవసాయ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఎన్నో రకాల అవార్డులతో సత్కరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశ హరిత విప్లవ పితామహుడిగా ఖ్యాతిగాంచిన 98 ఏళ్ల ఎంఎస్ స్వామినాథన్ ఇవాళ ఉదయం 1 1 గంటలకు ఆయన నివాసంలో కన్నుమూశారు. 1925 ఆగస్టు 7న మద్రాస్ రాష్ట్రంలో జన్మించిన స్వామినాథన్ మెట్రిక్యులేషన్ పూర్తి చేసి మెడికల్ స్కూల్‌లో చేరారు. కానీ 1943లో బెంగాల్‌లో చోటుచేసుకున్న కరువును కళ్లారా చూసిన స్వామినాథన్ వ్యవసాయ పరిశోధనలవైపుకు అడుగేశారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాల నుంచి జువాలజీ పట్టా పొంది మద్రాస్ అగ్రికల్చర్ కాలేజీ నుంచి అగ్రికల్చర్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీ భారత వ్యవసాయ పరిశోథనా సంస్థ నుంచి పీజీ చేశారు. ఆ తరువాత వ్యవసాయ రంగంలో ఎన్నో అద్భుతాలకు శ్రీకారం చుట్టారు. 


దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనేందుకు మేలురకం వరి వంగడాలను సృష్టించారు. 1960 నుంచి 1970 వరకూ స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చారు. కరవు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్దివైపుకు మరలించారు. 


ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా స్వామినాథన్ గ్రామీణ రూపురేఖల్ని సమూలంగా మార్చారు. పద్మ విభూషణ్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగానికి జరిపిన కృషి అభినందనీయమని వైఎస్ జగన్ కొనియాడారు. స్వామినాథన్ చేసిన కృషి దేశాన్ని ఆహారోత్పత్తిలో బలోపేతం చేసి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను సుసంపన్నం చేసిందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 


Also read: Jamili Elections: జమిలి ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం, సిద్ధమైన లా కమీషన్ నివేదిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook