Anant ambani Radhika merchant vidaai video viral: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుడి కొడుకు పెళ్లి న భూతో న .. భవిష్యత్ అన్న విధంగా జరిగిందని చెప్పుకొవచ్చు.  ముంబైలోని జియో వరల్డ్ కన్వేన్షన్ వేదికగా వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది.  అనంత్ అంబానీ రాధికల పెళ్లికి.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ల నుంచి తారాలోకం అంతా క్యూ కట్టారు. అదే విధంగా రాజకీయా, క్రీడారంగాలకు చెందిన దిగ్గజాలు సైతం ఈ పెళ్లికి హజరయ్యారు. పెళ్లికి వచ్చిన వారందరిని కూడా అంబానీ కుటుంబం ఎంతో ఆప్యాయంగా స్వాగతం తెలిపారు. అతిథులకు ఎక్కడ కూడా మర్యాదలకు లోటు రాకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా అనంత్ పెళ్లికి ముందే.. 50 మంది నిరుపేదల పెళ్లిళ్లు చేసి అంబానీ కుటుంబం వారికి మంచి బహుమతులు కూడా ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పెళ్లికి వచ్చే అతిథుల కోసం.. ప్రత్యేకంగా జెట్ విమానాలు, హోటల్స్ లలో రూమ్ లను కూడా సిద్ధంగా ఉంచారు.  మరోవైపు అనంత్ రాధికల పెళ్లి వేడుకలో తలైవా చేసిన డ్యాన్స్ మాత్రం మరో హైలేట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ పెళ్లికి దాదాపు.. 3 వేలరకాల స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ లను అతిథుల కోసం విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. అనంత్ పెళ్లివేడుకకు మాత్రం.. మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి కూడా అనేక మంది వీఐపీలు, వీవీఐపీలు కూడా హజరయ్యారు. మరోవైపు అనంత్ రాధికలు ఇద్దరు తమ పెళ్లిని ఎంతో ఎంజాయ్ చేశారు.


ఇద్దరు కూడా పలుమార్లు ఫ్యామిలీస్ తో కలిసి డ్యాన్స్ లు చేస్తు అందరికి ఆకట్టుకున్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుక, ముఖేష్ నీతా అంబానీలు దగ్గరుండి తమకొడుకు  కోసం పడిన తపన చూసి అందరు ఎమోషన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వీరు కాస్ట్యూమ్స్,  అతిథులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ లుగా ఇచ్చిన వాచీలు కూడా ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక రాధిక మర్చంట్ అప్పగింత కార్యక్రమం కూడా ఎంతో వేడుకగా జరిగింది. కానీ అందరి జీవితంలో లాగానే.. రాధిక కూడా తన తల్లిదండ్రులను విడిచి పోవడం సమయం రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యారు.


Read more:Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..


తన వాళ్లను చూస్తూ.. వారితో గడిపిన ప్రేమలు,అనురాగాలు గుర్తు చేసుకుని ఒకింత ఎమోషనల్ అయ్యారు. కోడలిని చూసి, ముఖేష్ అంబానీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో వీరి పరివారమంతా ఒకరి కోసం మరోకరు అన్నట్లుగా.. వీరి అప్పగింతల కార్యక్రమం సాగింది. సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో, ఈ సమయంలో భావోద్వేగానికి లోనౌతుంటారు. మరోవైపు ముఖేష్ అంబానీ కోడలిని చూస్తు.. తామంటూ ఉన్నామంటూ కూడా ధైర్యం చేప్పారు. అనంత్ అంబానీ తన భార్య రాధికను ప్రేమతో దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.